ఇలా ఎంత సేపు నిన్ను చూసినా
సరే, చాలు అనదు కంటి కామన
ఎదో గుండెలోని కొంటె భావన
అలా ఉండిపోక పైకి తేలునా
కనులను ముంచిన కాంతివొ
కలలను పెంచిన భ్రాంతివొ
కలవనిపించిన కాంతవొ
మతి మరపించిన మాయవొ
మది మురిరిపించిన హాయివొ
నిదురని తుంచిన రేయివొ
శుభలేఖలా నీకళ స్వాగతిస్తోందొ
శశిరేఖలా సొగసెటో లాగుతూ ఉందో
తీగలా అల్లగా చేరుకోనుందో
జింకలా అందక జారిపోనుందో
మనసున పూచిన కోరిక
పెదవుల అంచును దాటక
అదుముతు ఉంచకే అంతగ
అనుమతినివ్వని ఆంక్షగ
నిలబడనివ్వని కాంక్షగ
తికమక పెట్టక ఇంతగ
మగపుట్టుకే చేరని మొగలి జడలోన
మరుజన్మగా మారని మగువు మెడలోన
దీపమై వెలగనీ తరుణి తిలకాన
పాపనై ఒదగనీ పడతి ఒడిలోన
నా తలపులు తన పసుపుగ
నా వలపులు పారాణిగ
నడిపించిన పూదారిగ
ప్రణయము విలువే కొత్తగ
పెనిమిటి వరసే కట్టగ
బ్రతకన నేనే తానుగ
చిత్రం : శశిరేఖా పరిణయం (2008)
సంగీతం : మణిశర్మ & విద్యాసాగర్
రచన : సిరివెన్నెల
గానం : రాహుల్ నంబియార్