పల్లవి:
ఓ చిన్నారి చినుకమ్మ
నువ్వు కరిగేది ఎప్పుడమ్మా
ఓ బంగారు చిలకమ్మా
నువ్వు ఎగిరేది ఎపుదమ్మ
నీళ్ళలోని చేపకి కన్నీళ్ళుస్తున్నయని
చెప్పేవారు చూపేవారు ఎవరమ్మ
తన తడి తెలియదే తనకయినా //ఓ చిన్నారి //
చరణం:
ఊపిరి ఆవిరాయ్యి వేగుతున్నదో
గుండెలో మబ్బులే కమ్ముకున్నవో
తెలిసేదెల చినుకమ్మకి
వాకిటె వేకువే వచ్చి ఉన్నదో
కాటుకే చికట్యి ఆపుతున్నదో
తేలేదెల చిలకమ్మకి
ఈ జన్మ ఖైదేవరు వేసారో
నీ వీధి తలుపెవరు మూసారో
కాలయిన కధపందే తెలిసేనా
కను రెప్ప విడకుండా తెలిసేనా
మేలకువనే నిధరనుకునే //ఓ చిన్నారి //
చరణం:
నిత్యము చేదు గ్యాపకాలతో
హరునే వింటూ ఉన్నా జీవితం
వినేదెల గుండె సవ్వడి
నిన్నటి నీడలే నిండిపోయినా
చూపులో ఎక్కడ చోటు లేనిదే
చేరేదెల రేపులన్నవి
నిట్టూర్పులే ఊపిరనుకుంటే
ముని మబ్బులే తూర్పులనుకుంటే
ఏ అమృతం జంటకోస్తుంది
ఏ నమ్మకం కంటపడుతుంది
బతుకంటే గతమనుకునే //ఓ చిన్నారి //
చిత్రం : ప్రేమించేది ఎందుకమ్మా (1999)
సంగీతం : ఇళయరాజా
రచన : వరికుప్పల యాదగిరి
గానం : భవతరిని