పన్నెండు దాటి పదమూడు వస్తే టీనేజి టీనేజి
పదమూడు దాటి పద్నాలుగొస్తే ఖోలో జీ లవ్ పేజి
పదిహేనులోన మొదలెట్టుకో పదహారులోన పదునెట్టుకో
పదిహేడులోన గురిపెట్టుకో పద్దెందిలోన యమ రెచ్చిపో…
13 టు 19 వరకే టీనేజి జవాని లోతుల్లోకి వోయేజి (2)
నూనుగు మీసాలొస్తయ్ ఎన్నెన్నో కలలొస్తయ్
ఊహలకే రెక్కలు వస్తయ్ కవితల్నే కురిపిస్తయ్
కోరికల గుర్రాలేమో కళ్ళను తెంచుకు పరుగులుపెడుతుంటాయ్
it’s your life you can take it any way if you wanted to
it’s your life you can make it any way if you wanted to
it’s your life you can think it any way if you wanted to
it’s your life you can sink it any way if you wanted to it’s your life
హంసల్లె నడిచే పిల్ల జడలో పువ్వు పడిపోతే
ఆ పువ్వు వాసన చూస్తు కలలు కనేదే టీనేజి
పొరపాట్నో బ్యూటీ క్వీను హాండ్ కర్చీఫుని వదిలేస్తే
దాన్నే ఓ తియ్యని గుర్తుగ దాచుకొనేదే టీనేజి
వీకయిన బాంగిల్స్ అయినా విసిరేసిన బాల్ పెన్ అయినా
తను తాగిన టీ కప్పైనా తల్లోని హాండ్ క్లిప్ ఐనా
కాదేది ప్రేమకనర్హం ప్రేమించే మనసే ముఖ్యం
it’s your life you can take it any way if you wanted to
it’s your life you can make it any way if you wanted to
13 టు 19 వరకే టీనేజి జఫాని లోతుల్లోకి వోయేజి
అబ్బాయిల హార్టులన్ని అమ్మాయిలకి ప్లే గ్రౌండ్సే
కాలేజి బుక్సన్నీ తలకిందుండే పిల్లోసే
బాబిచ్చిన పచ్చనోటులు టికెట్లవుతాయ్ మాట్నికే
చూపుల్తో చెలగాటాలు టీనేజిలోని సిలబసే
పబ్లిక్లో మీటింగు పార్కుల్లో లవ్వింగు
డే అండ్ నైటు డ్రీమింగ్ ఎగ్జాంలో క్రైయింగ్
టీనేజికే అన్ని సొంతం టీనేజే ట్రూ వసంతం
it’s your life you can take it any way if you wanted to
it’s your life you can make it any way if you wanted to
13 టు 19 వరకే టీనేజి జఫాని లోతుల్లోకి వోయేజి (2)
నూనుగు మీసాలొస్తయ్ ఎన్నెన్నో కలలొస్తయ్
ఊహలకే రెక్కలు వస్తయ్ కవితల్నే కురిపిస్తయ్
కోరికల గుర్రాలేమో కళ్ళను తెంచుకు పరుగులుపెడుతుంటాయ్
it’s your life you can take it any way if you wanted to
it’s your life you can make it any way if you wanted to
it’s your life you can think it any way if you wanted to
it’s your life you can sink it any way if you wanted to it’s your life
చిత్రం : నేను (2004)
సంగీతం : విద్యాసాగర్
రచన : భువనచంద్ర
గానం : టిప్పు