ప్రేమించానని చెప్పనా మనసిచ్చానని చెప్పనా
నాలొ ఆశలు చెప్పనా నాలొ ఊసులు చెప్పనా
నువ్వె నేనై చెప్పనా
నీలో నేనే చెప్పనా
ప్రేమించానని చెప్పనా మనసిచ్చానని చెప్పనా
నాలొ ఆశలు చెప్పనా నాలొ ఊసులు చెప్పనా
నువ్వె నేనై చెప్పనా
నీలో నేనే చెప్పనా
పైర గాలి నీలా తాకి పోయె వేళా
ప్రేమలో పులకింతలె అనుకోనా
నీలినింగి నీలా మారి పోయె వేళ
లోకమె ప్రియురాలని అనుకోనా
ఊహలోన తేలీ వేల ఊసులాడీ
శ్వాసలాగ మారీ గుండెలోన చేరీ
తీపి ఆశలే చెప్పనా
ప్రేమించానని చెప్పనా మనసిచ్చానని చెప్పనా
నాలొ ఆశలు చెప్పనా నాలొ ఊసులు చెప్పనా
దూరమైన గాని భారమైన గాని
నీడల నిను వీడదె తొలి ప్రేమా
గాలివానె రాని గాయమైనా కాని
హాయిగ చిగురించద మన ప్రేమా
గుండె ఆగిపోనీ గొంతు ఆరిపోనీ
కాలమాగి పోనీ నేల చీలిపోనీ
ప్రేమ పోదనీ చెప్పనా
ప్రేమించానని చెప్పనా మనసిచ్చానని చెప్పనా
నాలొ ఆశలు చెప్పనా నాలొ ఊసులు చెప్పనా
నువ్వె నేనై చెప్పనా
నీలో నేనే చెప్పనా
నువ్వె నేనై చెప్పనా
నీలో నేనే చెప్పనా
చిత్రం : ఔనన్నా కాదన్నా (2005)
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
రచన : కులశేఖర్
గానం : సందీప్ , ఉష