పల్లవి:
ఎంత దూరమూ అదీ ఎంత దూరమూ
ఎంత దూరమూ అదీ ఎంత దూరమూ
పరిమళించు పాన్పులకూ నిరీక్షించు చూపులకూ
పరిమళించు పాన్పులకూ నిరీక్షించు చూపులకూ
వేసిన తలపులకూ వేచిన తలపులకూ
ఎంత చేరువో అది అంత దూరము
ఎంత దూరమూ అదీ యెంత దూరమూ
ఎంత దూరమూ అదీ యెంత దూరమూ
ఉదయించే కిరణాలకు ఉప్పొంగే కెరటాలకు..
ఉదయించే కిరణాలకు ఉప్పొంగే కెరటాలకు..
కలలుగనే చెలునికీ కలతపడే చెలియకు
ఎంత చేరువో అది అంత దూరము
చరణం 1:
ఎంత దూరమూ అదీ ఎంత దూరమూ
ఎంత దూరమూ అదీ ఎంత దూరమూ
మనసు పడని సంపంగికి.. మరులు విడని భ్రమరానికి
మనసు పడని సంపంగికి.. మరులు విడని భ్రమరానికి
ఉన్నదానికీ.. అనుకున్నదానికీ
ఎంత చేరువో అది అంత దూరము
చరణం 2:
ఎంత దూరమూ అదీ ఎంత దూరమూ
ఎంత దూరమూ అదీ ఎంత దూరమూ
అల్లనాటి ఆశలకూ.. అణగారిన బాసలకూ
అల్లనాటి ఆశలకూ.. అణగారిన బాసలకూ
మరువరాని అందానికి.. చెరిగిపోని బంధానికి
ఎంత చేరువో అది అంత దూరము
ఎంత దూరమూ అదీ ఎంత దూరమూ
ఎంత దూరమూ అదీ ఎంత దూరమూ
చిత్రం: ఏకవీర (1969)
సంగీతం : కె.వి. మహదేవన్
రచన : సి.నారాయణ రెడ్డి (సినారె)
గానం: S.P.బాలు, P.సుశీల