పల్లవి :
అభిమాని లేనిదే హీరోలు లేరులే
అనుచరులు లేనిదే లీడర్లు లేరులే
కార్మికులు లేనిదే ఓనర్లు లేరులే
భక్తులే లేనిదే దైవాలు లేరులే
హీరో నువ్వే లీడర్ నువ్వే
ఓనర్ నువ్వే దైవం నువ్వే
వెనక వెనక వెనక ఉండకురా
ముందుకు ముందుకు ముందుకు దూసుకురా
వాళ్ల...
చరణం : 1
నీశక్తే ఆయుధము...నీప్రేమే ఆలయము
నమ్మరా ఒరేయ్ తమ్ముడా
నీ చెమటే ఇంధనము...ఈ దినమే నీ ధనము
లెమ్మురా నువ్వు బ్రహ్మరా
మనసే కోరే మందు ఇదే....మనిషికి చేసే వైద్యమిదే
అల్లోపతి టెలీపతీ....అల్లోపతి హోమియోపతి
అన్నీ చెప్పెను ఈ సంగతి
ఒణకు బెణుకు తొణుకు వదలరా
జర...
చరణం : 2
సంతృప్తే చెందడమూ.....సాధించేదాపడమూ
తప్పురా అదో జబ్బురా
సరిహద్దే గీయటమూ.....స్వప్నాన్నే మూయటమూ
ముప్పురా కళ్లే విప్పరా
ఆ లోపాన్నే తొలగించు.....ఆశయాన్నే రగిలించు
దేహం నువ్వే ప్రాణం నువ్వే
దేశానికి గర్వం నువ్వే
చమకు చమకు చురుకు చూపైరా
చిత్రం : నాగవల్లి (2010)
సంగీతం : గురుకిరణ్
రచన : చంద్రబోస్
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
**********************************
Abhimaani lenidhe herolu lerule..
anucharulu lenidhe leaderlu lerule..
kaarmikulu lenidhe onarlu lerule..
Bhakthule lenidhe dhaivaalu lerule..
Hero nuvve.. Leader nuvve...
Owner nuvve.. dhaivam nuvve....
venaka venaka venaka undakuraa.......
mundhuku mundhuku mundhuku doosuku raa...
vaalla....
Movie Name : Nagavalli (2010)
Music Director : Gurukiran
Lyricist : Chandrbose
Singer : S.P.Bala Subramanyam