• Home
  • Error Page
  • Privacy Policy
  • Disclaimer
  • About
  • f
  • t
  • g+
Cinema Song Lyric

  • News
  • Gadget
    • Blackberry
      • Curve
      • Gemini
      • Bold
    • HTC
    • Samsung
    • Spesifikasi
  • Internet
    • Facebook
    • Google
    • Twitter
  • Operating System
    • Android
    • Apple
    • Blackberry
  • Blogger
    • Widgets
    • Tips
    • Templates
  • Health
Home » Tanpa kategori » భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో...

భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో...

సంక్రాంతి అంటేనే పందేల పండుగ. పది రోజుల ముందే పండుగ హడావిడి మొదలైనా... ఆ శోభకు శ్రీకారం జరిగేది మాత్రం ‘భోగి’ నుంచే. భోగిమంటలతో పోటీల పర్వం మొదలవుతుంది. ఇక ముగ్గుల పందేలతో ఆడవాళ్లు... కోడి పందేలతో మగాళ్లు... గాలిపటాల పందేలతో పిల్లలు... ఇలా చెప్పుకుంటూ పోతే... సర్వం పందేల మయం. వీటి మధ్య సినిమాల పందేలు. అప్పుడే బాక్సాఫీస్ దగ్గర వేడి మొదలైంది. మహేష్ ‘1’, చరణ్ ‘ఎవడు’ రిలీజులు ఇప్పటికే జరిగిపోయాయి. కనుమ దాటి ముక్కనుమకు చేరేసరికి విజయం ఎవరి సొంతమో తేలిపోతుంది. ఈ లోపు సరదాగా ‘భోగి స్పెషల్ సాంగ్స్’ని కాసేపు నెమరు వేసుకుందాం. భోగి పండుగ భోగం ఏ స్థాయిలో ఉంటుందో తెలిపే ఈ పాటలు నిజంగా తెలుగు దనానికి ప్రతికలే.

భోగిమంటలు(1981)
భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో...
భోగిమంటల భోగుల్లో...
తెల్లారకుండానే పల్లెపల్లంతాను
ఎర్రని కాంతుల భోగుల్లో
తెల్లారకుండానే పల్లెపల్లంతాను
ఎర్రని కాంతుల భోగుల్లో...
ఆచార్య ఆత్రేయ రాసిన ఈ పాట ఏ రోజు విన్నా... ఆ రోజే భోగి పండుగలా అనిపిస్తుంది. ఇక రమేశ్‌నాయుడు స్వరరచన తెలుగుదనానికి అద్దం పట్టిందనే చెప్పాలి. దీనికి తోడు కృష్ణ, రతి అగ్నిహోత్రిల అభినయం, విజయనిర్మల టేకింగ్ ఈ పాటకు హైలైట్స్. ‘భోగిమంటలు’ సినిమా వచ్చి 33 ఏళ్లు అవుతున్నా... ఇంకా ఈ పాట శ్రోతల్ని అలరిస్తూనే ఉంది. బాలు, సుశీల, బృందం ఈ పాటను ఆలపించారు.

దళపతి (1992)
సింగారాల పైరుల్లోన
బంగారాలే పండేనంటా పాడాలి
నవ్వుల్లోన పువ్వుల్లాగ
జీవితాలే సాగాలంటా ఆడాలి
ఈనాడు.. ఊరంతటా... రాగాల దీపాలటా..
నీకోసం.. వెలిగేనటా.. ఉల్లాసం.. నీవేనటా.. హోయ్
ఈ పాటను అనువాద గీతమంటే ఎవరైనా నమ్ముతారా? అంతగొప్పగా రాశారు రాజశ్రీ. ‘వద్దంటానే పాతదనాన్ని ముద్దంటానే కొత్తదనాన్ని.. కొత్తగ ఇపుడే పుట్టావనీ అనుకోమంటారా హోయ్. మూలబడివున్నా.. బుట్టా తట్టా తీసి.. భోగిమంటల్లోన నీవే వెయ్యరా..’ అంటూ.. భోగి పండుగ పరమార్థాన్ని రెండే ముక్కల్లో చెప్పారాయన. రాజశ్రీ అక్షరాలకు ఇళయరాజా స్వరరచన తోడైతే.. ఇక చెప్పేదేముంది! శ్రోతలు పులకించక ఏంచేస్తారు? నిజంగానే అంతగా ఆకట్టుకుందీ పాట. పైగా ఈ పాట పాడింది ఎవరనుకున్నారు.. కె.జె.ఏసుదాస్, ఎస్పీబాలు. ఇద్దరూ అగ్రగణ్యులే. పాటకు పట్టాభిషేకం చేసినవారే. ఇక చేసింది తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, మలయాళ సూపర్‌స్టార్  మమ్ముట్టి. తీసింది మణిరత్నం. ఇంతమంది ఘనాపాటీలు కలిశారు కాబట్టే రెండు దశాబ్దాలు దాటినా ఇంకా ఈ పాటను జనాలు ఇష్టపడుతూనే ఉన్నారు.

రాముడొచ్చాడు (1996)
మా పల్లే రేపల్లెంటా... ఈ పిల్లే రాధమ్మంటా...
రేగుతుంటే భోగిమంట.. రేగుపళ్ల విందులంటా
రేతిరంతా కోడిపుంజు కొక్కోక్కో
మంచుపూల జల్లులంటా మంచెకాడ గిల్లుడంటా
మంచమేస్తే సంకురాత్రి తిరునాళ్ళో
పల్లె పచ్చగా పిల్ల వెచ్చగా ఉంటే పండగ.
భోగి పండుగ శోభ అంతా ఈ పాటలోనే కనిపిస్తుంది కదూ! మరి వేటూరా మజాకా. సిటీల్లో పరిస్థితి ఎలా ఉన్నా... పల్లెల్లో యువతరానికి సంక్రాంతి అంటే నిజంగా పెద్ద సంబరమే. పట్టు పరికిణీల్లో అమ్మాయిలూ, టిప్పుటాప్పుగా అబ్బాయిలూ... అలకలు, అల్లర్లు, సరదాలు, సరాగాలు అన్నింటికీ వేదిక సంక్రాంతి. ‘రేగుతుంటే భోగిమంట...రేగుపళ్ల విందులంటా... రేతిరంతా కోడిపుంజు కొక్కోక్కో...’ అని వేటూరి రాసింది అందుకే. ఎస్పీబాలు, చిత్ర, బృందం ఆలపించిన ఈ పాటకు స్వరరచన చేసింది రాజ్. ఆయన సంగీతం సమకూర్చిన హిట్ సాంగ్స్‌లో ఇదీ ఒకటి. ఇక నాగార్జున, సౌందర్యల అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పాలా!

సిందూరం (1997)
ఏడుమల్లెలెత్తు సుకుమారికి
ఎంత కష్టమొచ్చింది నాయనో..
భోగిపళ్లు పోయాలి బేబికి..
ఏమి దిష్టి కొట్టింది నాయనో..
ముగ్గులెట్టు ముచ్చట్లలో
ముచ్చెమట్లు పట్టాయిరో...

మంచు బొట్లు ఆ బుగ్గలో అగ్గిచుక్కలైనాయిరో...
పల్లెల అందాలు ఏ తీరుగా ఉంటాయో ఈ పాట చూస్తే అర్థమైపోతుంది. అలముకున్న మంచు పొరల మాటున పరుచుకున్న పచ్చదనం,  భగభగ మండుతున్న భోగి మంటలు, పాలపుంతల్ని తలపించే సంక్రాంతి ముగ్గులు. వీటికి దీటుగా అందమైన అమ్మాయిలు. వాళ్లనే టార్గెట్ చేస్తూ సిరివెన్నెల కలం కదిపారు. ఆ అక్షరాలను స్వరబద్ధం చేసే బాధ్యతను సంగీత దర్శకుడు ‘శ్రీ’ తలకెత్తుకున్నాడు. తండ్రి చక్రవర్తిని తలపించాడు కూడా. కృష్ణవంశీకి తెలుగుదనంపై ఉన్న మమకారం మొత్తం ఈ పాటలో కనిపిస్తుంది. ఇక పరికిణీలో సంఘవి అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తెలుగమ్మాయి కాకపోయినా.. బాపు బొమ్మనే గుర్తుచేసింది. ఇక రవితేజ గురించి తెలిసిందేగా! ఓవరాల్‌గా అందర్నీ రంజింపజేసేసిందీ పాట.

సంక్రాంతి పండుగ నేపథ్యంలో చాలా పాటలొచ్చాయి కానీ, భోగి పాటలు మాత్రం తక్కువే. అయినా... వచ్చిన ప్రతిపాట అందర్నీ అలరించి, మన సంప్రదాయ విలువలకు అద్దం పట్టింది. కొన్నేళ్లుగా ఇలా పండుగల్ని ప్రతిబింబించే పాటలు సినిమాల్లో కరువయ్యాయి. ‘ట్రెండ్’ అంటూ... క్లబ్బుల చుట్టూ, పబ్బుల చుట్టూ, విదేశాల చుట్టూ సినిమా పాట తిరుగుతోంది. మన ‘సోల్’ ఏంటో మనం మరిచిపోతున్న పరిస్థితి ప్రస్తుతం సినిమాల్లో నెలకొని ఉంది. పాశ్చాత్య పోకడలను ప్రతిబింబించే ఈ విధానాలను భోగిమంటల్లో ఆహుతి చేస్తూ... మన సంస్కృతిని ప్రతిబింబించే కొత్తదనాన్ని తెలుగు సినిమా ఆహ్వానించాలని ఆశిద్దాం.
భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో... , Pada: 22.35

Share to

Facebook Google+ Twitter
Diposting oleh Unknown di 22.35

Related Posts

0 komentar :

Posting Komentar

« Next Prev »

Most Popular

  • ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం.....        ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం..... ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం...నడుమ ఈ నాటకం విధిలీల వెంట ఏ బంధమూ...రక్త సంబంధమూ...తోడుగా రాదుగా తుదివేళ మరణమనేది ఖాయమనీ...మిగిలెను కీర్తి కాయ...
  • అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ.. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ ...
  • Pataas telugu movie songs lyrics
    Pataas telugu movie songs lyrics
    Movie : Pataas (2015) Cast : Nandamuri Kalyan Ram, Shruthi Sodhi Music : Sai Kartheek Lyrics : Bhuvanachandra, Sri Mani, B. Subbaraya Sharma...
  • Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Movie Name : Pilla Nuvvu Leni Jeevitham (2014) Cast: Sai Dharam Tej, Regina Cassandra Music Director: Anoop Rubens Lyrics : Bhaskarabhatla, ...
  • Yevade Subramanyam telugu movie songs lyrics
    Yevade Subramanyam telugu movie songs lyrics
    Movie : Yevade Subramanyam (2015) Cast: Nani, Malavika Nair, Vijay Devarakonda, Ritu Varma Music : Radhan Lyrics : Vasishta Sharma,  Directo...

Arsip Blog

  • ►  2015 (64)
    • ►  April (26)
    • ►  Maret (18)
    • ►  Februari (5)
    • ►  Januari (15)
  • ▼  2014 (410)
    • ►  Desember (18)
    • ►  November (13)
    • ►  Oktober (7)
    • ►  September (60)
    • ►  Agustus (87)
    • ►  Juli (22)
    • ►  Juni (34)
    • ►  Mei (42)
    • ►  April (39)
    • ►  Maret (8)
    • ►  Februari (52)
    • ▼  Januari (28)
      • సార్థక నామధేయుడు (సందర్భం - బ్రహ్మానందం పుట్టినరోజు)
      • అక్కినేని నాగేశ్వర రావు అంత్యక్రియలు - ఈనాడు దినపత...
      • బడికెళ్లని ఆచార్యుడు...
      • శిఖరం ఒరిగింది... అక్కినేని అస్తమించారు...
      • నీకోసమే నేనంటూ ఉన్నది ...... హార్ట్ ఎటాక్ (2014)
      • నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టమే ........ హార్ట్ ఎట...
      • ఎందుకిలా వేధిస్తున్నావే ... హార్ట్ ఎటాక్ (2014)
      • చూపించండే....చూపించండే.... హార్ట్ ఎటాక్ (2014)
      • Thats all right... Thats all right mama.... హార్ట్...
      • సెలవనుకో మరి ఏడవకే మనసా ........ హార్ట్ ఎటాక్ (2014)
      • వస్తవా .. వస్తవా .. వస్తవా .. హార్ట్ ఎటాక్ (2014)
      • హాయమ్మ హాయమ్మ హాయమ్మా .... లేడీస్ టైలర్ (1985)
      • భానుప్రియ
      • భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో...
      • హృదయమా ఓ బేల హృదయమా ....... బావమరదళ్లు (1961)
      • Jeans telugu movie song lyrics
      • Jenda Pai Kapiraju telugu movie song lyrics
      • నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ( భగవద్గీత శ...
      • తెలిసింది నువ్వంటే ఏంటో ... తెలిసింది ఈ క్షణం .......
      • రాజాధి రాజాధిరాజా నేనే... జెండాపై కపిరాజు (2014)
      • డోంట్ వర్రీ డోంట్ వర్రీ బీ హ్యాపీ ....... జెండాపై ...
      • ఇంతందంగా ఉందా లోకం... ఎటు పోయిందో మాయా మైకం ..... ...
      • Bunny n Cherry telugu movie song lyrics
      • ఏమో ఎటువైపో పయనం ... ఏ కంచికి చేరని కథనం ...... బన...
      • మనసా ఎలా మనసా ఎలా ........... బన్నీ N చెర్రీ (2013)
      • Biriyani telugu movie song lyrics
      • Sundarakanda telugu movie songs lyrics
      • Sivaji telugu movie songs lyrics
  • ►  2013 (1026)
    • ►  Desember (108)
    • ►  November (93)
    • ►  Oktober (217)
    • ►  September (108)
    • ►  Maret (119)
    • ►  Februari (206)
    • ►  Januari (175)
  • ►  2012 (1500)
    • ►  November (186)
    • ►  Oktober (739)
    • ►  September (281)
    • ►  Agustus (294)

Mengenai Saya

Unknown
Lihat profil lengkapku
Diberdayakan oleh Blogger.
Copyright © 2014 Cinema Song Lyric Design by SHUKAKU4RT - All Rights Reserved