హొయ్యారే హొయ్యా హొయ్యా - హొయ్యారే హొయ్యా హొయ్యా ॥ 2 ॥
పల్లవి: సూడ సక్కాని తల్లి
సుక్కల్లో జాబిల్లి
నవ్వుల్లో నాగామల్లి
నా పల్లె పాలవెల్లి
మళ్లీ జన్మంటూ ఉంటే సూరమ్మో ఓ...ఓ...ఓ...
తల్లీ నీ కడుపున పుడుతా మాయమ్మా.... ॥ 2 ॥
॥ సూడ సక్కాని తల్లి ॥
చరణం: తొలికూడి కూయంగా
తెలతెల్ల వారంగా....
పాలు కడవల్లు నిండా
పల్లె బంగారు కొండా
పారుతున్న యేరు
పచ్చ పచ్చనీ పైరు
ముత్యాల ముగ్గుల్లో
సిగ్గు లొలికే పల్లె
సంక్రాంతి సంబరాలు సూరమ్మో ఓ...ఓ...ఓ...
అంబరాన్ని తాకే సూడమ్మో ॥ 2॥
॥ సూడ సక్కాని తల్లి ॥
చరణం: పుండ్లున్న సుండున్న
చీదరించాకుండా
ఊడిగమెంతో జేసే
మాయన్న మంగలన్న
పల్లెంతా మైల దీసి
మల్లే పువ్వుగా జేసి
ఓహోహోం ఓహో అంటూ
పల్లకీ మోలైనావు
మాడేలును మదిలో తలచీ ఓరన్నా ఓ...ఓ...ఓ...
ఊరికీ దివిటైనావా మాయన్నా
నువ్వు ఊరికీ దివిటైనావా మాయన్నా
॥ సూడ సక్కాని తల్లి ॥
జాజిరి జాజిరి జాజిరి హోయ్ ॥ 2॥
చరణం: మట్టిని ముద్ద జేసి
మా కూటికి కుండైనావా
గౌడన్న కల్లు గీసి
పల్లెంలే కల్లుబోసీ
బొద్దంతా బట్ట నెయ్యా
గుండే దారపు కండే
ఆరు గజాల చీర
అగ్గిపెట్టెల్లో పెట్టే
చేతి కులవత్తులకు ఓరన్నా ఓ....ఓ...ఓ...
చెయ్యెత్తి దండం పెడతా సాలన్న ॥ 2॥
॥ సూడ సక్కాని తల్లి ॥
చరణం: అల్లల్ల నేరళ్ళ
గొళ్ల కురుమల మంద
ఊరు మేలు కోరే
భీరన్న దండాలన్న
బొత్తగాలి తిత్తి
పొద్దంతా ఒత్తి ఒత్తి
కొడవల్లకు కత్తయినావు
నాగళ్ళ కర్రయినావు
కమ్మరి కొలువైనావా... ఓరన్నా...ఓ...ఓ...ఓ...
మా ఊరికీ చెలిమైనావా మాయన్నా ॥ 2 ॥
॥ సూడ సక్కాని తల్లి ॥
చరణం: కాళ్ళకీ చెప్పయినావు
దండోర డప్పయినావు
పల్లెకు చివరనుంటూ
ఊరికే కాపైనావు
ఎండ వానల్లో నీవే...
సేను సెలకల్లో నీవే...
అయ్యారే మాలన్న
అన్ని పనులల్లో నీవే
సరిరారు నీకెవరు ఓరన్నా...ఓ...ఓ...ఓ....
సల్లంగా ఉండాలి మాయన్న
నువ్వు సల్లంగా ఉండాలి మాయన్న
॥ సూడ సక్కాని తల్లి ॥
ఓ...ఓ....ఓ... ఓ...ఓ...ఓ...
చిత్రం : ఊరు మనదిరా (2002)
సంగీతం : కోటి
రచన: అందెశ్రీ
గానం: రమణ
****************************************
Movie Name : Vooru Manadira (2002)
Music Director : Koti
Lyricist : Andesree
Singer : Ramana