
జిగిజిగిజిగిజా జాగేల వనజా రావేల నా రోజా
జిగిజిగిజిగిజా ఓ బాల రాజా నీదేర ఈ రోజా
నీదేలే వలపుల వైభోగం
నాదేలే మమతల మణిహారం
లాలీ లాలీ ప్రేమ రాణి అనురాగంలోనే సాగిపోనీ
మీనా లోనా చేరుకొనీ సురభోగాలన్నీ అందుకొనీ
పెదవి పెదవి కలవాలి ఎదలో మధువే కొసరాలి
బ్రతుకే మమతై నిలవాలి మురళీ స్వరమై పలకాలి
ప్రేయసి పలుకే మాణిక్య వీణ ప్రేమావేశంలోన
కౌగిలి విలువే వజ్రాల హారం మోహావేశంలోన
రావే రావే రస మందారమా....
స్నానాలాడే మోహనాంగి ఇక సొంతం కావే శోభనాంగి
దూరాలన్నీ తీరిపోనీ రసతీరాలేవో చేరుకోనీ
తనువూ తనువూ కలిసాక వగలే ఒలికే శశిరేఖ
ఎగసే కెరటం ఎదలోన సరసం విరిసే సమయాన
ముందే నిలిచే ముత్యాల శాల పూవై నవ్వే వేళ
రమ్మని పిలిచే రత్నాల మేడ సంధ్య రాగంలోన
వలపే పలికే ఒక ఆలాపన
చిత్రం : చెట్టు కింద ప్లీడరు (1989)
సంగీతం : ఇళయరాజా
రచన :
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , చిత్ర
*********************************************
Movie Name : Chettu kinda Pleader (1989)
Music Director : Ilayaraja
Lyricist :
Singers : S.P.Bala Subramaniam, Chitra