పావురమా పావురమా
మన బ్రతుకే పంజరమా
కన్నులలో కాపురమా
అందని ఓ గోపురమా
పావురమా పావురమా
మన బ్రతుకే పంజరమా
వెన్నెల్లో మల్లెపూల మంచం వేసి ఉంచాను
అందాల మందారాల గంధాలెన్నో దాచాను
కళ్ళల్లో ఒత్తులు వేసి నీకై వేచి వున్నాను
వెచ్చన్ని కౌగిళ్ళల్లో ఒకటై పోదామన్నాను
వెన్నెల పామై కరిచిన వేళ
కన్నుల ఆశ కరిగిన వేళ
జాలైనా లేనే లేదా రానే రాదా నీకింకా
ఈ బాధ తీరేదేట్టా నీవే చెప్పు నాకింకా
ఎన్నాళ్ళీ ఉపవాసాలు ఎన్నేళ్ళమ్మా వనవాసం
శివరాత్రి రాకుండానే జాగారం
అకుంది వక్కా వుంది రెండు కలిసేదేనాడో
పరువాల తాంబూలంతో పెదవులు పండేదేనాడో
నెమ్మది లేని తుమ్మెద గోల
తుమ్మెద రాని పూవుల జ్వాల
ఎన్నెన్నో కలలే కన్నా నిన్న నేడు నీకోసం
మౌనంగా ఏడుస్తున్నా నాలో నేనే మనకోసం
చిత్రం : ఆ ఒక్కటి అడక్కు (1993)
సంగీతం : ఇళయరాజా
రచన :
గానం : S.P.బాల సుబ్రహ్మణ్యం , ఎస్.జానకి