పూర్తి పేరు : పాలువాయి భానుమతీ రామకృష్ణ
జననం : 07-09-1925
జన్మస్థలం : ఒంగోలు తాలూకా దొడ్డవరం గ్రామం
తల్లిదండ్రులు :
సరస్వతమ్మ, బొమ్మరాజు వెంకట సుబ్బయ్య
వివాహం - భర్త : 08-08-1943 - రామకృష్ణారావు
సంతానం : కుమారుడు (భరణి)
నటిగా తొలిచిత్రం : వరవిక్రయం (1939)
ఆఖరిచిత్రం : పెళ్లికానుక (1998)
చిత్రాలు : దాదాపు 100 (తెలుగు, తమిళం, హిందీ, కన్నడం)
గాయకురాలిగా తొలిచిత్రం - పాట : వరవిక్రయం - పలుకవేమి నా దైవమా, ఆఖరిచిత్రం - పాట : పెళ్లికానుక - ‘బంగారుబొమ్మకు’ పాట బాలుతో
పాటలు : సుమారు 250 పైగా సంగీత దర్శకురాలిగా తొలిచిత్రం : చక్రపాణి
(1954), ఆఖరిచిత్రం : అసాధ్యురాలు (1993)
చిత్రాలు : 11
దర్శకత్వం వహించిన సినిమాలు : 6 (కొన్ని మధ్యలో ఆపేశారు)
గౌరవపురస్కారాలు : ఉత్తమనటిగా 1956లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అవార్డు, తమిళ ప్రభుత్వం నుండి 1956లో ‘నడిప్పుక్క ఇలక్కణం’, 1960లో ‘కలైమామణి’ బిరుదులతో సత్కరించారు. తాను రాసిన ‘అత్తగారి కథలు’ కు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, 1966లో పద్మశ్రీ, 1975లో ఆంధ్రయూనివర్సిటీ నుండి ‘కళాప్రపూర్ణ’, 1986లో రఘుపతి వెంకయ్య అవార్డు, 1998లో రాజాలక్ష్మీ ఫౌండేషన్ అవార్డు, 2004లో ఎన్‌టీఆర్ జాతీయ అవార్డు, మరెన్నో అవార్డులు అందుకున్నారు.
ఇతర విషయాలు : భానుమతి తల్లిదండ్రులిద్దరూ సంగీతంలో ప్రవేశమున్నవారే. సంగీతంలో తన తొలిగురువు తండ్రి కావడం విశేషం. ఆమెకు ఎమ్మెస్ సుబ్బులక్ష్మి అంటే ఎంతో అభిమానం. ఒకసారి త్యాగ రాజ ఆరాధనోత్సవాల సమయంలో తిరువాయూరు లో సుబ్బులక్ష్మితో కలిసి ‘ఎందరో మహానుభావులు’ కీర్తన పాడే అవకాశం లభించింది. ఆ గాత్రమాధుర్యం సినీరంగంలోని ప్రముఖల దృష్టిని ఆకట్టుకుంది. ఇక అప్పటి నుంచి గాయకునిగా, నటిగా, సంగీత దర్శకులురాలిగా, నిర్మాతగా, రచయిత్రిగా సినిమా రంగంలో తన ప్రతిభను అన్నివిధాలా చాటుకున్నారు.
మరణం : 24-12-2005