పల్లవి:
నీ ఆశ... అడియాశ...చెయిజారే మణిపూస
బ్రతుకంతా అమావాస.. లంబాడోళ్ళ రాందాసా
నీ ఆశ అడియాశ చెయిజారే మణిపూస
బ్రతుకంతా అమావాస లంబాడోళ్ళ రాందాసా
చరణం 1:
ఓ... తలచినది ఒకటైతే జరిగినది వేరొకటి
తలచినది ఒకటైతే జరిగినది వేరొకటి
చితికినది నీ మనసు అతుకుటకూ లేరెవరు
నీ ఆశ అడియాశ చెయిజారే మణిపూస
బ్రతుకంతా అమావాస లంబాడోళ్ళ రాందాసా
చరణం 2:
గుండెలలో గునపాలు గుచ్చారే నీవాళ్ళు
గుండెలలో గునపాలు గుచ్చారే నీవాళ్ళు
కన్నులలో గోదారి కాలువలే కట్టింది
నీ ఆశ అడియాశ చెయిజారే మణిపూస
బ్రతుకంతా అమావాస లంబాడోళ్ళ రాందాసా
బ్రతుకంతా అమావాస లంబాడోళ్ళ రాందాసా..
చిత్రం : ఎం.ఎల్.ఎ. (1957)
సంగీతం : పెండ్యాల
రచన : ఆరుద్ర
గానం: ఘంటసాల, జానకి