ఎక్కడి దొంగలు అక్కడనే గప్ చుప్
ఎవరే పిలిచారు నిన్నెవరే పిలిచారు
ఎక్కది దొంగలు అక్కడనే గప్ చుప్ //ఎవరె //
చాటుగా కనుచాటుగా చూడకే ఇటు చూడకె
పొదలలో పూపొదలలో పొంచినా గాలించినా //2//
కనులకు నే కనిపించనులే.. //ఎక్కడి //
నీడలో దోబూచిగా ఆడకే తారాడాకే
నీటిలో కోనేటిలో చూడకే వెదుకాడకే ..//2//
దాగుడు మూతలు చాలునులే ... // ఎక్కడి //
వెదికినా నే దొరకనే పిలిచినా నే పలుకనే
హృదయమే నా కొసగినా ఎదుటనే కనిపింతునే.. //2//
ఎన్నటికీ నిను వీడనులే ... //ఎక్కడి //
చిత్రం : ఇల్లరికం (1959 )
సంగీతం : టి.చలపతి రావు
రచన : శ్రీశ్రీ
గానం : ఘంటసాల
(ఇది మహమ్మద్ రఫీ పాడిన "తుమ్‌సా నహీ దేఖా"కు అనుకరణ)