పల్లవి:
ఇదేమి లాహిరి...ఇదేమి గారడి
ఎడారిలోన పూలు పూసి ఎంత సందడి
ఇదేమి లాహిరి ..ఇదేమి గారడి
ఎడారిలోన పూలు పూసి ఎంత సందడి
ఇదేమి లాహిరి ..ఇదేమి గారడి
ఎడారిలోన పూలు పూసి ఎంత సందడి
ఇదేమి లాహిరి ..
చరణం 1:
కోరుకున్న చిన్నదాని నవ్వూ...కోటి కోటి పరిమళాల పువ్వు
ఆ...ఆ..చిన్ననాటి సన్నజాజి చెలిమి ...కన్నులందు దాచుకున్న చెలిమి
ఆనాటి కూరిమి కలువలోని వేడిమి
ఆనాటి కూరిమి కలువలోని వేడిమి .. అనురాగపు మేలిమి....
ఇదేమి లాహిరి ..ఇదేమి గారడి
ఎడారిలోన పూలు పూసి ఎంత సందడి
ఇదేమి లాహిరి ..
చరణం 2:
రామచిలుక ప్రేమమాట పలికే... రాజహంసలాగ నడిచి కులికే
ఆ...గోరువంక చిలుక చెంత వాలే ...కొసరి కొసరి కన్నెమనసునేలే
కాబోయే శ్రీమతి .. మది నీకే బహుమతి
కాబోయే శ్రీమతి మది నీకే బహుమతి ..అది ఆరని హారతి....
ఇదేమి లాహిరి ..ఇదేమి గారడి
ఎడారిలోన పూలు పూసి ఎంత సందడి
ఇదేమి లాహిరి ..ఈ...ఉహ్మ్..ఉహుం...
లలలేలాలలలే...లలేలలేలా....
చిత్రం : ఈడు - జోడు (1963)
సంగీతం : పెండ్యాల
రచన : ఆరుద్ర
గానం: ఘంటసాల, P.సుశీల