పల్లవి :
చిటపట చినుకులు పడుతూవుంటే
చెలికాడే సరసన ఉంటే
చెట్టాపట్టగ చేతులు పట్టి చెట్టునీడకై పరిగెడుతుంటే
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి
ఉరుములు పెళపెళ ఉరుముతు వుంటే
మెరుపులు తళతళ మెరుస్తు వుంటే
మెరుపు వెలుగులో చెలి కన్నులలో
బిత్తర చూపులు కనపడుతుంటే
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి
చరణం : 1
కారుమబ్బులు కమ్ముతువుంటే.. కమ్ముతువుంటే
ఓ... కళ్ళకు ఎవరూ కనపడకుంటే.. కనపడకుంటే
ఆ... కారుమబ్బులు కమ్ముతువుంటే.. కమ్ముతువుంటే
ఓ... కళ్ళకు ఎవరు కనపడకుంటే.. కనపడకుంటే
జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకు పోతుంటే
జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకు పోతుంటే
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి
చరణం : 2
చలిచలిగా గిలి వేస్తుంటే అహా.. హాహాహా
గిలిగింతలు పెడుతూవుంటే ఒహొహొహో
చలిచలిగా గిలి వేస్తుంటే అహా.. హాహాహా
గిలిగింతలు పెడుతూవుంటే ఒహొహొహో
చెలి గుండియలో రగిలే వగలే
చెలి గుండియలో రగిలే వగలే
చలి మంటలుగా అనుకుంటే
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి
చిటపట చినుకులు పడుతూవుంటే
చెలికాడే సరసన ఉంటే
చెట్టాపట్టగ చేతులు పట్టి చెట్టునీడకై పరిగెడుతుంటే
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి
చిత్రం : ఆత్మబలం (1964)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఘంటసాల, పి.సుశీల