పల్లవి :
ఆకాశం దించాలా నెలవంక తుంచాలా... సిగలో ఉంచాలా... ఆ...
ఆకాశం దించాలా నెలవంక తుంచాలా... సిగలో ఉంచాలా... ఆ...
చెక్కిలి నువ్వు నొక్కేటప్పటి చక్కలి గింతలు చాలు
ఆకాశం నా నడుము నెలవంక నా నుదురు
సిగలో నువ్వేరా... ఆ... ఆ... ఆ...
చరణం : 1
పట్టుతేనె తెమ్మంటే చెట్టెక్కి తెస్తానే... తెస్తానే...
మిన్నాగు మణినైనా పుట్టలోంచి తీస్తానే... తీస్తానే...
ఆ... పట్టుతేనె నీకన్నా తియ్యంగా ఉంటుందా
మిన్నాగు మణికైనా నీ ఇలువ వస్తుందా
అంతేనా అంతేనా... అవును అంతేరా... ఆ...
ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా... ఆ...
ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా... ఆ...
చరణం : 2
సూరీడు ఎరద్రనం సిందూరం చేస్తానే... చేస్తానే...
కరిమబ్బు నల్లదనం కాటుక దిద్దేనే... దిద్దేనే...
ఆ... నీ ఒంటి వెచ్చదనం నన్నేలే సూరీడు
నీ కంటి చల్లదనం నా నీడ నా గూడు
అంతేనా అంతేనా... అవును అంతేరా... ఆ...
మెరిసేటి చుక్కల్నీ మెడలోన చుట్టాలా తలంబ్రాలు పొయ్యాలా
గుండెలోన గువ్వలాగ కాపురముంటే చాలు
ఆకాశం అంచుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా... ఆ...
చిత్రం : భక్త కన్నప్ప (1976)
రచన : ఆరుద్ర
సంగీతం : సత్యం
గానం : వి.రామకృష్ణ, పి.సుశీల