పల్లవి:
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
మమతలు వేయిగా పెనవేయి నన్ను తీయగా
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
మమతలు వేయిగా పెనవేయి నన్ను తీయగా
చరణం
ముసిముసి నవ్వులలో గుసగుసలాడినవే
నా తొలి మోజులె నీ విరజాజులై
ముసిముసి నవ్వులలో గుసగుసలాడినవే
నా తొలి మోజులె నీ విరజాజులై
మిసమిస వన్నెలలో మిలమిల మన్నవిలే
నీ బిగి కౌగిలిలో జాబిలి రాతృలే
కాటుకలంటుకున్న కౌగిలింతలెంత వింతలే
మనసులు పాడే మంతన మాడే ఈ పూట జంటగా
మమతలు వేయిగా పెనవేయి నన్ను తీయగా
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
మమతలు వేయిగా పెనవేయి నన్ను తీయగా
చరణం
తొలకరి కోరికలే తొందర చేసినవే
ఈ విరి సయ్యకె ఆవిరి తీరగా
తొలకరి కోరికలే తొందర చేసినవే
ఈ విరి సయ్యకె ఆవిరి తీరగా
సొగసరి కను కలే సొదపెడుతున్నవిలే
ఏ తెర చేతునొ ఆ చెర వీడగా
అందిన పొందులోనే అందలేని విందులే అవే
కలలిక పండే కలయిక నేడే కావాలి వేయిగా
మమతలు వేయిగా పెనవేయి నన్ను తీయగా
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా
మమతలు వేయిగా పెనవేయి నన్ను తీయగా
చిత్రం : ఇంటింటి రామాయణం (1979)
సంగీతం : రాజన్-నాగేంద్ర
రచన : వేటూరి సుందర రామమూర్తి
గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం