జాబిలితో చెప్పనా...
జాబిలితో చెప్పనా జామురాతిరి నిదురలోన
నీవు చేసిన అల్లరి చెప్పనా రోజా
జాబిలితో చెప్పనా
జాబిలితో చెప్పనా జామురాతిరి కలలలోన
నేవు రేపిన అలజడి చెప్పనా రాజా
తుమ్మెదలంటని తేనెలకై
తుంటరి పెదవికి దాహాలు
చుక్కలు చూడని చీకటిలో
దిక్కులు కలవని విరహాలు
చూపులలో చలి చురచురలు
ఆ చలి తీరని విరవిరలు
అన్నీ ఆవిరి పెడుతుంటే
నన్నే అల్లరి పెడుతున్నావని
చెప్పనా చెప్పనా చెప్పనా(జాబిలితో)
గొంతులు దాటిన గుండెలలో
కోయిల పాడని గీతాలు
సూర్యుడు చూడని గంగలలో
అలలై పొంగిన అందాలు
కౌగిట కాముని పున్నమలు
వెన్నెల వీణల సరిగమలు
పేరంటానికి రమ్మంటే
పెళ్ళికి పెద్దవు నీవేలెమ్మని
చెప్పనా చెప్పనా చెప్పనా
చిత్రం : వేటగాడు (1979)
సంగీతం : చక్రవర్తి
రచన : వేటూరి
గానం : ఎస్.పి .బాల సుబ్రహ్మణ్యం , పి .సుశీల