పల్లవి :
అభినవ శశిరేఖవో ప్రియతమ శుభలేఖవో (2)
ఆ తొలి చూపు కిరణాల నెలవంక నీవో
నవయువ కవిరాజువో ప్రియతమ నెలరాజువో
నా కనుదూయి కమలాల భ్రమరమ్ము నీవో
నవయువ కవిరాజువో ప్రియతమ నెలరాజువో
చరణం:
ఆ కనులు ఇంద్ర నీలాలుగా
ఈ తనువు చంద్ర శిఖరాలుగా
కదలాడు కల్యాణివే
నా హృదయం మధుర సంగీతమై
కల్యాణ వీణ స్వరగీతమై
శ్రుతి చేయు జతగాడివే
ఆ జతలోన వెతలన్ని చల్లార్చవే
నవయువ కవిరాజువో అభినవ శశిరేఖవో
చరణం:
నా వయసు వలపు హరివిల్లుగా
నవపారిజాతాల పొదరిల్లు గా రావోయి రవిశేఖరా
తొలి సంధ్య మధుర మందారమే
నీ నుదిటి తిలక సింగారమై నూరేళ్ళు వెలిగించనా
నా నూరేళ్ళ నెల వళ్ళు కరిగించనా
అభినవ శశిరేఖవో ప్రియతమ శుభలేఖవో
ఆ తొలి చూపు కిరణాల నెలవంక నీవో
నవయువ కవిరాజువో ప్రియతమ నెలరాజువో
నా కనుదూయి కమలాల భ్రమరమ్ము నీవో
అభినవ శశిరేఖవో ప్రియతమ నెలరాజువో
చిత్రం : గృహ ప్రవేశం(1988)
సంగీతం: సత్యం
రచన: జాలాది
గానం: S.P.బాలు, P.సుశీల
***********************
Movie Name : Gruha Pravesham (1988)
Music Director : Satyam
Lyricist : Jaladi
Singers : S.P.Balu , P.Susheela