Senin, 28 Oktober 2013

అందమైనది ముందర ఉంది.. అందుకే యమ తొందరగుంది... నెంబర్ వన్ (1994)

అందమైనది ముందర ఉంది
అందుకే యమ తొందరగుంది
రంభ మరదలు రంజుగ ఉంది
సంబరానికి సయ్యని అంది

పాలపొంగుకి ఆశగ ఉంది
పైటకొంగుకి కోరిక ఉంది
పూతరేకుల కానుక ఉంది
ఆరగింపుకి రమ్మని అంది

అడిగిందీ రాచిలకా అలకలు తీర్చు రసగుళికా
తగిలిందా చెలి చురకా సరిగమపా సరసమిక
అరె మొదలెడితే తెరవనక మెరుపులమేను తకిటతక
విరబూసే వయసు ఇక నిలవదుపా నువు లేక
అరె మోజైతే సయ్యంటు రాక మొహమాటమేలా ఇక
ఊరంతా గగ్గోలు గాక చూడాలి నువ్వే ఇక
గుండెలో ఏ బెంగలేక గుట్టుగా రావే ఇక
జోరుగా నూరేళ్ళదాకా ఎగరేయి జెండా ఇక                         ||అందమైనది||

తపనలలో తలమునక చలిచలివేళ చమకుచక
పొదవెనుక పరువమిక పదనిసలే పలుకునిక
ఆ చురుకుమనే చూపులకి శృతిమించేను సోకు ఇక
ముదిరినదా మురిపమిక మొదలుకదా మోత ఇక
నువ్వంటే పడిచస్తా మామా నీకే నా సోకిస్తా రా
నీకోసం దిగి వచ్చా భామా వలపిస్తా వడిపట్టవే
గుండెల్లో కోయిళ్ళ కూత తీయనా నీ కౌగిట
బుగ్గలో దానిమ్మపూత ఓలమ్మీ ఈ సందిట                      ||అందమైనది||


చిత్రం :  నెంబర్ వన్ (1994)
సంగీతం :  S.V. కృష్ణారెడ్డి
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
*********************************************
Movie Name : Number One (1994)
Music Director : S.V.Krishna Reddy
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singers : S.P.Balasubramanyam, K.S.Chitra

Tidak ada komentar:

Posting Komentar