Senin, 28 Oktober 2013

కోలో కోలో కోయిలమ్మా కొండాకోనా బుల్లెమ్మా.... నెంబర్ వన్ (1994)

కోలో కోలో కోయిలమ్మా కొండాకోనా బుల్లెమ్మా
ఏలో ఏలో ఎన్నెలమ్మా ఏలాలమ్మా నా ప్రేమా
వయ్యారం ఉయ్యాలూగి హొయ్యా హొయ్యా
ఒంపుల్లో జంపాలూగి సయ్యా సయ్యా
గువ్వలా చేరుకో గుండెలోనా

కోలో కోలో కొమ్మారెమ్మా కొండాకోనా ఓయమ్మా
ఏలో ఏలో చందమామ ఏలాలయ్యా నా ప్రేమా
వయ్యారం ఉయ్యాలూగి హొయ్యా హొయ్యా
సరసాల జంపాలల్లో సయ్యా సయ్యా
గువ్వలా చేర్చుకో గుండెలోనా

తాకితే ఎర్రాని బుగ్గ కందాలా
మీటితే వయ్యారివీణ థిల్లానా
కలికిచిలక వలపు చిలకగా
కలువచెలియ కలువ రమ్మనె
కిలకిలలో...మురిపెములే అలలూలలుగా
జల్లులై వెల్లువై పొంగిపోయే                ||కోలో కోలో||

ఓ ప్రియా లాలించమంది వయ్యారం
మోజులే చెల్లించమంది మోమాటం
చిలిపిచూపు సొగసు నిమరగ
జాజితీగ జడకు అమరగ
గుసగుసలే....ఘుమఘుమలై గుబులు రేపగా
ఝుమ్మనే తుమ్మెదై కమ్ముకోవా                      ||కోలోకోలో||


చిత్రం :  నెంబర్ వన్ (1994)
సంగీతం :  S.V. కృష్ణారెడ్డి
రచన :  జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు 
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర 
*********************************************
Movie Name : Number One (1994)
Music Director : S.V.Krishna Reddy 
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singers : S.P.Balasubramanyam, K.S.Chitra

Tidak ada komentar:

Posting Komentar