పల్లవి :
రాజ్యము బలము మహిమ నీవే నీవే
జవము జీవము జీవనమీవేనీవే
॥
మరియ తనయ మధుర హృదయ
మరియ తనయ మధుర హృదయ
కరుణామయా! కరుణామయా!
॥
చరణం : 1
అవసరానికి మించి ఐశ్వర్యమిస్తే
మనిషి కన్నుమిన్ను కానబోడే మో
కడుపుకు చాలినంత కబళమీయకుంటే
మనిషి నీతినియమం పాటించడేమో
మనిషి మనుగడకు సరిపడనిచ్చి
శాంతి ప్రేమ తృప్తినిచ్చి
॥
గుండె గుండె నీ గుడి దీపాలై
అడుగు అడుగు నీ ఆలయమయ్యే
రాజ్యమీవయ్యా...
నీ రాజ్యమీవయ్యా
చరణం : 2
అర్హత లేనివారికి అధికారం ఇస్తే
దయ ధర్మం దారి తప్పునేమో
దారి తప్పినవారిని చేరదీయకుంటే
తిరిగి తిరిగి తిరగబడతారేమో
తగినవారికి తగు బలమిచ్చి
సహనం క్షమ సఖ్యతనిచ్చి
॥
తనువు తనువు నిరీక్షణశాలై
అణువు అణువు నీ రక్షణశాలయ్యే
బలమీవయ్యా... ఆత్మబలమీవయ్యా
చరణం : 3
శిలువపైన నీ రక్తం చిందిననాడే
శమదమాలు శోధించెనుగాదా
నీ పునరుత్థానంతో రక్షణ రాజిల్లి
శోకం మరణం మరణించెను గాదా
చావు పుటుక నీ శ్వాసలని
దయాదండన పరీక్షలని
॥
ఉనికి ఉనికి నీ వెలుగు నీడలని
సత్యం మార్గం సర్వం నీవని
మహిమ తెలుపవయ్యా...
నీ మహిమ తెలుపవయ్యా
॥
చిత్రం : రాజాధిరాజు (1980)
సంగీతం : కె.వి.మహదేవన్
రచన : వేటూరి
గానం : పి.సుశీల
****************************************
Movie Name : Rajadhiraju (1980)
Music Director : K.V.Mahadevan
Lyricist : Veturi Sundararama Murthy
Singer : P.Susheela