పల్లవి :
అచ్చ తెలుగుభాషరా అమ్మంటే
అచ్చు వేద ఘోషరా అమ్మంటే
ఆప్యాయత కంచంలో అనురాగంలా
తొలి అన్నం ముద్దరా అమ్మంటే
ఆత్మీయత పలకంపై అనుబంధంలా
తొలి అక్షర ముత్యంరా అమ్మంటే ॥
చరణం : 1
ఆకసాన సృష్టికర్త బ్రహ్మరా
అవనిమీద సృష్టికర్త అమ్మరా ॥
గోదారి కాశ్మీరం ఓ తిరుపతి క్షేత్రం
నీధ్యాసే నిరంతరం ఇదే అమ్మ గోత్రం
అమ్మంటే స్వచ్ఛమైన శ్వాసరా
అమ్మంటే స్పష్టమైన యాసరా ॥
చరణం : 2
అమ్మపాట మానవాళి జాతీయగీతం
అమ్మమాట ఆవుపాల జలపాతం ॥
పాలతోటి మురిపాలు
ఇదే అమ్మ స్థన్యం
ప్రేమ కరుణ జాలి దయ
ఇవే అమ్మ సైన్యం
అమ్మంటే జనజీవన వేదమురా
అమ్మంటే మరో ప్రణవనాదంరా ॥
చిత్రం : సూపర్ హీరోస్ (1997)
సంగీతం : మణి శర్మ
రచన : ఏ.వి.యస్.
గానం : యస్.పి.బాల సుబ్రహ్మణ్యం, సుజాత
*************************************************
Movie Name : Super Heroes (1997)
Music Director : Mani Sharma
Lyricist : A.V.S
Singers : S.P.Bala Subramanyam, Sujatha