పల్లవి :
ఇంద్రధనస్సు చీరకట్టి
చంద్రవదన చేరవస్తే
చుక్కలకే కులుకొచ్చిందంట
సూర్యుడికే కునుకొచ్చిందంట
ఇంద్రధనస్సు చీరకట్టి
చంద్రవదన చేరవస్తే
చూపులకే పలుకొచ్చిందంట
జాబిలికే నడకొచ్చిందంట
చరణం1 :
నడిరేయి సమయాన ఒడిచేరు తరుణాన
నక్షత్ర చేమంతి జడలల్లనా
నవ్వుల్లో తొలిపువ్వులే గిల్లనా
ప్రేమ అనే కౌగిలిలో
పెళ్ళి అనే పందిరిలో
ఇచ్చి పుచ్చుకున్నమాట మంత్రమాయెనే
ఇద్దరొక్కటయిన పాట మనుగడాయెనే
ఇంద్రధనస్సు చీరకట్టి
చంద్రవదన చేరవస్తే
చూపులకే పలుకొచ్చిందంట
జాబిలికే నడకొచ్చిందంట
చరణం2 :
ఆరారు ఋతువుల్లో అందాల మధువుల్లో
అరుదైన రుచులెన్నో అందించనా
విరితేనెలో తానమాడించనా
పరువమనే పల్లకిలో
అందమనే బాలికలా
వాలుకనుల వలపుగనుల నీలిమెరుపులో
పిలుపులేవో మేలుకొలిపె ఈ ఉషస్సులో
ఇంద్రధనస్సు చీరకట్టి
చంద్రవదన చేరవస్తే
చుక్కలకే కులుకొచ్చిందంట
సూర్యుడికే కునుకొచ్చిందంట
చిత్రం : గజదొంగ (1980)
సంగీతం : చక్రవర్తి
రచన : వేటూరి సుందరరామమూర్తి
గానం : ఎస్.పి. బాలు, సుశీల
***************************************
Movie Name : Gaja Donga
Music Director : Chakravarthy
Lyricist : Veturi Sundara Ramamurthy
Singers : Balu, Susheela