పల్లవి:
ఎంతబాగా అన్నావు..
ఎంతబాగా అన్నావు..ఎవ్వరు నేర్పిన మాటరా
వేలడైన లేవురా..వేదంలా విలువైన మాట
ఎంత బాగా అన్నావు..ఎవ్వరు నేర్పిన మాటరా
వేలడైన లేవురా..వేదంలా విలువైన మాట
ఎంతబాగా అన్నావు..
చరణం 1:
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..అ
జారని వానల జల్లులూ..ఊరికే ఉరిమే మబ్బులు
జారని వానల జల్లులూ..ఊరికే ఉరిమే మబ్బులు
ఆ మబ్బులెందుకూ..?
ఊరని తేనేల సోనలూ..ఊరికే పూచే పూవులు..
ఊరని తేనేల సోనలూ..ఊరికే పూచే పూవులు..
ఆ పూవులెందుకు..?
ఉతుత్తి మాటలు అనవచ్చా..మాటలు చేతలు కావాలి
ఆ చేతలు పదుగురు మెచ్చాలి..
నూరేళ్ళు బతకాలీ..నూరేళ్ళూ బతకాలీ..
ఎంతబాగా అన్నావు..ఎవ్వరు నేర్పిన మాటరా
వేలడైన లేవురా..వేదంలా విలువైన మాట
ఎంతబాగా అన్నావు..
చరణం 2:
ఆఆఆ ఆఆఅ మ్మ్..ఆ...ఆ..ఆ.. మ్మ్ మ్మ్ ఆ...ఆ...ఆ
అన్నమాట నిలిపావని..అపుడే ఘనుడైనావనీ
ముందే మురిసే మీ నాన్నా..ఆ ముసి ముసి నవ్వులు చూడరా...
కన్నా..ఆ..కన్నీరు కాదురా..కన్నవారి దీవెనరా...
ఏటికేడుగా..ఏడంతస్తుల మేడగా..ఏటికేడుగా..ఏడంతస్తుల మేడగా
నూరేళ్ళు బతకాలీ..నూరేళ్ళూ బతకాలీ..
శ్రీరామ రక్షా...శ్రీరామరక్షా...
ఎంతబాగా అన్నావు..ఎవ్వరు నేర్పిన మాటరా
వేలడైన లేవురా..వేదంలా విలువైన మాట
ఎంతబాగా అన్నావు..
చిత్రం : అమ్మ మాట (1972)
సంగీతం : రమేశ్ నాయుడు
రచన : దేవులపల్లి కృష్ణ శాస్త్రి
గానం : P.సుశీల