చిలిపి యాత్రలో చల్ చల్ చల్
జరపమందిలే జంతర్ మంతర్ చెప్పుకో ఎందుకో
పడుచు గుండెలో ఘల్ ఘల్ ఘల్
తెలుసుకుందిలే ఫ్యూచర్ మంజిల్ ఇప్పుడే అందుకో
కొత్త కొత్త రంగుల్లో కంట పడ్డ రంగంలో
పుట్టనున్న స్వప్నాలెన్నెన్నో లెక్క పెట్టుకో
ఎదురుగ ఉంది ఏదో వింత
పద పద చూదాం ఎంతో కొంత
కలలకు కూడా కొత్తే అవునా
కనబడలేదే నిన్నా మొన్నా
కనుల విందుగా ఉందీ లోకం
కనక ఇక్కడే కాసేపింకా ఉందాం
కలవరింతలా ఉందీ రాగం
కనక ఇక్కడే కాసేపింకా ఉందాం
కలవరింతలా ఉంది రాగం
కనక మెల్లగా మళ్ళీ మళ్ళీ విందాం
ఎవర్నైనా హెల్లో అందాం
ఎటేముందో కనుక్కుందాం
టుమారోల సమాచారమంతా
సులువుగ తెలిసిన తరుణము కద ఇది
వినపడలేదా కుకు welcome
అతిదులమంటూ answer చేద్దాం
తళతళ లాడే తారా తీరం
తలుపులు తీసే దారే చూద్దాం
మునుపు ఎప్పుడు లేదీ మైకం
మయుడు మిస్టరీ ఏమో ఈ మాలోకం
మెదడు విక్టరీ చేసే చిత్రం
తెలివి dictionary చెప్పే మాయా మంత్రం
నిదానించి ప్రవేశిద్దాం
రహస్యాలు పరిక్షిద్దాం
కనుక్కున్న చమత్కారాలన్ని
చిలవలు పలవలు కలిపి తెలుపుదాం
చిత్రం : ఆదిత్య 369 (1991)
సంగీతం : ఇళయరాజా
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర
************************************
Chilipi yaatralo chal chal chal
Jarapamandile jantar mantar cheppuko enduko
Paduchu gundelo ghal ghal ghal
Telusukundile future manjil ippude anduko
Kotta kotta rangullo kantapadda rangamlo
Puttanunna swapnaalennenno lekka pettuko
Yeduruga undi yedo vinta
Pada pada chudaam yento konta
Kalalaku kuda kotte avunaa
Kanabadalede ninnaa monnaa
Kanula vindugaa undee lokam
Kanaka ikkade kaasepinkaa vundaam
Kalavarintalaa undi ragam
Kanaka mellagaa mallee mallee vindaam
Evarnaina hello andaam
Yetemundo kanukkundaam
Tomorrow la samaachaaramantaa
Suluvuga telisina tarunamu kada idi
Vinapadaledaa kuku welcome
Atidulamantu answer cheddam
Talatala laade taaraa teeram
Talupulu teese daare chuddaam
Munupu eppudu ledee maikam
Mayudu mystery yemo ee maalokam
Medadu victory chese chitram
Telivi dictionary cheppe maayaa mantram
Nidaaninchi praveshiddaam
Rahasyaalu parikshiddaam
Kanukkunna chamatkaaraalanni
Chilavalu palavalu kalipi telupudaam
Movie Name : Aditya 369 (1991)
Music Director : Ilayaraja
Lyrics : Sirivennela Sitarama Sastry
Singers : S.P.Bala subrahmanyam, K.S.Chitra