
పల్లవి :
కొండపైన ... వెండివాన..
అది గుండెల్లో కొత్తవలపు కురిపించాలి
ఆ కొత్తవలపు కోరికలను పండించాలి
కొండపైన ... వెండి వానా.. ఆ ఆ..
చరణం 1:
మబ్బులు వస్తూ పోతుంటాయి
నిలిచేదొకటే నీలాకాశం
కలతలు వస్తూ పోతుంటాయి
మిగిలేదొకటే వలచే హృదయం
కన్నీళ్లలో కలకల నవ్వీ
కలహాలలో చెలిమిని పెంచీ
కలలాగా బ్రతుకంతా జీవించాలీ
కొండపైన... వెండి వానా..ఆ ఆ...
చరణం 2:
నిప్పులు చెరిగే వేసవితోనే
తేనెలు కురిసే వానొస్తుందీ
ఆకులు రాల్చే కాలంతోనే
చిగురులు తొడిగే ఘడియొస్తుందీ
అనురాగమే తీయని వరమై
ఆనందమే తరగని సిరియై
కలకాలం కాపురం సాగించాలి
కొండపైన ... వెండివాన
అది గుండెల్లో కొత్తవలపు కురిపించాలి
ఆ కొత్తవలపు కోరికలను పండించాలీ
చిత్రం : ఇంటి దొంగలు (1973)
సంగీతం : కోదండపాణి
రచన : సి. నారాయణ రెడ్డి
గానం: ఎస్.పి.బాలు, సుశీల
*************************************************
Movie Name : Inti Dongalu (1973)
Music Director : S.P.Kodandapani
Lyricist : C. Narayana Reddy
Singers : S.P.Balasubramaniam, P.Susheela