చెబుతా నీకో వింత కధ
ఎపుడూ ఎవరూ వినని కధ(2)
కత్తి కన్న పదునైన కధ
కడలి కన్న లోతైన కధ
కల్లాకపటం తెలియని మనిషికి
కాలం నేర్పిన కక్ష కధ(2)
రెక్కలాడినా డొక్కలాడని కటిక పేదనొకనాడు
రెక్కలున్న నా చెక్కు బుక్కుతో చుక్కల కొనగలనీనాడు
ఎన్ని కోట్లు నాకున్నా నేనెంత ఎత్తులో ఉన్నా
జనమంతా నా వెంటపడుతూ జేజేలు పలుకుతూ ఉన్నా
నాకు తెలుసు నేను చేస్తున్నవన్నీ తప్పులని
అయినా బ్రహ్మరధం పడుతున్నారు ప్రజలు నేను చాలా గొప్పవాణ్ణని
అందుకే అంటున్నాను నీతికి విలువలేదని నిజాయితీకి చోటు లేదని
నిజము తెలుసుకొన్నాను నా నడక మార్చుకొన్నాను
రాతిగుండెతో రాజాలాగ రాజ్యమేలుతున్నాను
అమ్మా అని పిలిచేందుకు తల్లి లేదు
అనురాగం పంచేందుకు ఆలు బిడ్డలు లేరు
ఆత్మీయతకు నోచుకోలేదు ఆప్యాయతకు పెట్టి పుట్టలేదు
అందుకే అంటున్నాను అన్నీ ఉన్నా ఏమి లేనివాణ్ణని
అయినా I am the king అప్పుడు ఇప్పుడు ఎప్పుడు I am the king
చిత్రం : ఆహుతి (1987)
సంగీతం : సత్యం
రచన : మల్లెమాల (యం. యస్. రెడ్డి)
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం
************************************
chebutaa neko vinta kadha
yepudu yevaru vinani kadha(2)
katti kanna padunaina kadha
kadali kanna lotaina kadha
kallakapatam teliyani manishiki
kalam nerpina kaksha kadha(2)
rekkalaadinaa dokkalaadani katika pedanokanadu
rekkalunna na chekku bukkuto chukkala konagalaneenaadu
yenni kotlu nakunnaa nenenta yettulo unnaa
janamantaa na ventapadutu jejelu palukutu unnaa
naku telusu nenu chestunnavannee tappulani
ayinaa brahmaradham padutunnaru prajalu nenu chalaa goppavannani
anduke antunnanu neetiki viluvaledani nijaayiteeki chotu ledani
nijamu telusukonnanu na nadaka marchukonnanu
ratigundeto rajaalag rajyamelutunnanu
ammaa ani pilichenduku talli ledu
anuragam panchenduku alu biddalu leru
atmeeyataku nochukoledu apyayataku petti puttaledu
anduke antunnanu anni unnaa yemi lenivannani
ayinaa I am the king appudu ippudu yeppudu I am the king
Movie Name : Aahuthi (1987)
Music Director : Satyam
Lyricist : Mallemaala (M.S.Reddy)
Singer : S.P.Bala Subramaniam