మా పాప పుట్టిన రోజు మళ్ళీ మళ్ళీ రావాలి
దివిలోని దేవతలంతా దీవెనలను అందించాలి(2)
కోహినూరు వజ్రం కన్నాకోటిరెట్ల కాంతివి నువ్వే
మా కంటి పాపవు నువ్వమ్మా
మా ఇంటి దీపము నీవమ్మా
గులాబి నీ అందానికి సలాము చేస్తుంది
మల్లెపువ్వు నీ నవ్వులకి గులాము అవుతుంది
సూర్యుడిలో తేజస్సు నీ యశస్సు కావాలి
చంద్రవంక చల్లదనం నీ మనస్సు కావాలి
ఆకాశం నిద్దురపోతే మేల్కొనే తారవు నువ్వే
మాకోసం మళ్ళి పుట్టిన మహాలక్ష్మి నువ్వే
మా గుండెను ప్రమిదను చేసావు
మా ఆశల ప్రతిమవు అయ్యావు
కోయిల నీ పాటలకి స్వరరచన చేసింది
నెమలి నీ ఆటలకి నాట్యం నేర్పింది
తాతయ్య నానమ్మ తలపులన్నీ నీ ధ్యాసే
మరుజన్మలో నీ బిడ్డలుగా పుడదామని ఆశే
అమ్మనాన్నలకు దేవుళ్ళిచ్చిన వరము
అదృష్టం ఆనందం కలగలిపిన నీ రూపం
పలానా పాపకు తండ్రిని నేనంటూ
చెప్పుకునే నే గర్వించాలమ్మా
చిత్రం : ఆహుతి...ఓ పాప కథ (2002)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
రచన :
గానం : వందేమాతరం శ్రీనివాస్, సునీత
************************************
maa paapa puttina roju malli malli ravali
divi loni devatalantaa deevenalanu andinchaali(2)
kohinuru vajram kannaa koti retla kaantivi nuvve
ma kanti papavu nuvvammaa
ma inti deepamu neevammaa
gulaabi ne andaaniki salamu chestundi
mallepuvvu ne navvulaki gulaamu avutundi
suryudilo tejassu ne yasassu kavali
chandravanka challadanam ne manassu kavali
aakasham niddurpote melkone taravu nuvve
makosam malli puttina mahalakshmi nuvve
ma gundenu pramidhanu chesavu
ma aashala pratimavu ayyavu
koyila ne patalaki swara rachana chesindi
nemali nee atalaki natyam nerpindi
tatayya nanamma talapulanni ne dhyase
marujanmalo ne biddaluga pudadamani aashe
amma nannalaku devullichina varamu
adrustam anandam kalagalipina ne rupam
palaana papaku tandrini nenantu
cheppukune ne garvinchalammaa
Movie Name : Aahuthi..O Papa Katha (2002)
Music Director : Vandemataram Srinivas
Lyricist :
Singers : Vandematram Srinivas, Sunitha