పల్లవి :
గుండెలో వాలవా చెలి చిలకా
శ్వాసలో కోరిక విన్నావుగా
కళ్లలో చేరవా తొలి వెలుగా
నీడవై చాటుగా ఉన్నావుగా
మాటలే చేతకాక సైగ చేశానుగా
సంతకం లేని లేఖా చేరనే లేదుగా
కలుసుకో త్వరగ కలలు నిజమవగా
||గుండెలో||
చరణం : 1
నీ వెంట తరుముతూ ఉంటే అసలు కన్నెత్తి చూశావా నన్ను
మరి నీ ముందే తిరుగుతూ ఉంటే ఎపుడు పన్నెత్తి పిలిచావా నన్ను
రోజు ఇలా ఈ గాలిలా నీ చెవిని తాకేది నేనేగా
మామూలుగా మాటాడక ఈ గాలి గోలేంటి చిత్రంగా
కలుసుకో త్వరగ కలలు నిజమవగా
|| కళ్లలో ||
చరణం : 2
కాస్తైన చొరవ చేయందే వరస కలిపేదెలాగంట నీతో
నువు కొంతైనా చనువు ఇవ్వందే తెలుసుకోలేను నీ సంగతేదో
వెంటాడక వేటాడక వలలోన పడుతుంద వలపైనా
నన్నింతగా వేధించక మన్నించి మనసివ్వు ఇపుడైనా
కలుసుకో త్వరగ కలలు నిజమవగా
|| గుండెలో ||
చిత్రం : ఈశ్వర్ (2003)
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
రచన : సిరివెన్నెల
గానం : రాజేష్ , ఉష
****************************
Gundelo vaalavaa cheli chilaka
Swaasalo korika vinnavugaa
Kallalo cheravaa tholi velugaa
Needavai chaatuga unnavugaa
Maatale chetakaaka saiga chesaanugaa
Santakam leni lekha cherane ledugaa
Kalusuko twaraga kalalu nijamavaga
Nee vente tarumutoo unte
Asalu kannett choosava nannu
Mari nee munde tirugutu unte
Epudu pannetti pilichava nannu
Roju ilaa ee gaalila
Nee chevini taakedi nenega
Maamoolugaa maatadaka
Ee gaali golenti chitramgaa
Kalusuko twaraga kalalu nijamavaga
Kallalo cheravaa...
Kaastaina chorava cheyande
Varasa kalipedelaaganta neeto
Nuvvu kontaina chanuvu ivvande
Telsukolenu nee sangatedo
Ventaadaka vetaadaka
Valalona padutunda valapaina
Nannitagaa vedhinchaka
Manninchi manasivvu ipudaina
Kalusuko twaraga kalalu nijamavaga
Movie Name : Eshwar (2003)
Music Director : R.P.Patnayak
Lyricist : Sirivennela
Singers : Rajesh, Usha