‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు!’ఈ పేరు వినగానే మనసుకు హాయిగా అనిపిస్తుంది. ఈ మహాత్మ్యం ఈ సినిమాలో నటిస్తున్న స్టార్స్‌వల్లో, మరెందువల్లో జరిగింది కాదు. ఆ సినిమా పేరులోని తీయదనం వల్ల వచ్చింది! దానికి కారణం అది తెలుగు భాషలో ఉండటమే. మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో సినిమా పేర్లన్నీ తమిళ భాషలోనే ఉంటుండగా మన సినిమాల పేర్లు మాత్రం తెలుగు తప్ప అన్ని భాషల్లో ఉంటున్నాయి. సినిమా నెమలికి కిరీటం లాంటి పేర్లలోనే తెలుగు లేనప్పుడు
మన సంస్కృతి చెట్టును మనమే గొడ్డలితో నరుక్కుంటున్నట్టు లెక్క! తెలుగు సినిమాల ధోరణిలో మార్పు మొదట సినిమాల పేర్ల నుంచే రావాలనే ఆకాంక్షను చెప్పే ప్రయత్నమే ఇది....
సినిమా పేరు అనేది మన ఇంటి ముంగిట వేసిన అందమైన ముగ్గులాంటిది. ఎలాంటి ముగ్గు వేసినా అది అతిథులను ఇంట్లోకి ఆహ్వానించడమేనని అర్థం. కానీ మనదైన ముగ్గు అయితే ఆ ఆహ్వానం మరింత ఆత్మీయంగా ఉంటుంది. గత దశాబ్దాకాలంగా తెలుగు సినిమాల పేర్లలో కనిపిస్తున్న విశేష లక్షణం... తెలుగేతర భాషా పదాలనే సినిమాల పేర్లుగా నిర్ణయించడం. అలా ప్రతియేటా తెలుగులో వస్తున్న దాదాపు 105 నుంచి 120 సినిమాలలో 60 సినిమాల పేర్లు తెలుగేతర భాషాపదాలతోనే ఉంటున్నాయి. సంస్కృతికి ఓ ప్రభావవంతమైన వాహికగా ఉంటున్న సినిమాలో పొడసూపుతున్న ఈ ధోరణి మారుతున్న కాలానికి, ప్రజల అభిరుచులకు అద్దంప అయినా దీనివల్ల దీర్ఘకాలంలో తెలుగు క్షీణించే అవకాశాలు మెండు అని తెలుగుభాషాభిమానుల, భాషా పండితుల కలవరం!
ముస్లిం.. బ్రిటిష్ పాలనల ప్రభావం...
ఇటీవలికాలంలో సినిమాలను సాంకేతిక సృజనాత్మక వ్యక్తీకరణలుగానే కాక బలమైన సాంస్కృతిక వారధులుగా కూడా పరిగణిస్తున్నారు. ఒక సంప్రదాయాన్ని, ట్రెండ్‌ను, ఫ్యాషన్‌ను జనంలోకి తీసుకెళ్లాలన్నా, ఆ ధోరణులకు సామాజిక ఆమోదం రావాలన్నా ఇప్పుడు సినిమాలే సాధనాలుగా మారాయి. దీనికి తగినట్లే సినిమాలూ సమాజంలో ఎప్పటికప్పుడు వస్తున్న పోకడలకు అద్దం పడుతూ, కొండొకచో వాటికి మరింత డ్రామా కలిపి అతిశయంగా చూపిస్తూ జనాల మనసుల్లోకి చొచ్చుకుపోయేలా చేస్తున్నాయి. అందుకే సాధారణంగా మనం రోజూ వినే పదాలు, భాషావాక్యాలు కూడా సినిమా టైటిల్స్‌గా మారి వాటి సహజత్వాన్ని మించిన కొత్త అర్థాన్ని, ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి. అయితే తెలుగు సినిమా పేర్లలో తెలుగేతర పదాల చొరబాటు, ప్రాచుర్యం అనే ధోరణి రావడానికి మన దేశంలో వందల ఏళ్లపాటు పాలించిన ముస్లిం పరిపాలన, బ్రిటిష్ పాలనలే కారణమని చెప్పాలి. 1206 నుంచి 1757 వరకు ఇస్లాం పాలకుల పాలన వల్ల అరబ్, ఉర్దూ, పర్షియన్ పదాలు మన భాషల్లో విస్తృతంగా కలిశాయి. అలాగే 1pandu57 నుంచి 1947 దాకా దేశాన్ని పాలించిన బ్రిటిష్ పాలకుల వల్ల ఇంగ్లీష్ పదాలు మన భాషల్లోకి ప్రవేశించాయి. భాషా పరిణామక్షికమంలో ఈ తరహా ‘ఆదానవూపదానాలు’ సహజమే అయినప్పటికీ అవి క్యాన్సర్ కణంలా క్రమక్షికమంగా తెలుగు భాషాదేహాన్నే ఆక్రమించుకుంటూ ఉండటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నది. దానికి సినిమాల పేర్లు కూడా తమవంతు ‘సహకారాన్ని’ అందించడం అత్యంత విషాదం!తెలుగు సినిమాపేర్లు... తెలుగేతర భాషల ప్రభావం
తెలుగుసినిమాల పేర్లను మొదట ప్రభావితం చేసిన భాష సంస్కృతం అని చెప్పాలి. తెలుగు సాహిత్యం కూడా మొదట్లో సంస్కృతభాషా ప్రభావంతోనే ఎదగడం వల్ల తెలుగు సినిమాల పేర్లు కూడా దీనికి మినహాయింపు కాలేకపోయాయి. దానికి తెలుగు మొదటి సినిమా ‘భక్తవూపహ్లాద’నే మంచి ఉదాహరణ. 1931లో విడుదలైన ఈ సినిమాపేరు తెలుగుభాషా శాస్త్ర నియమాల ప్రకారం ‘భక్తవూపహ్లాదుడు’ అని ఉండాలి. కానీ సంస్కృత ఉచ్ఛారణకు దగ్గరగా ఉండే ‘భక్త ప్రహ్ల్లాద’గానే స్థిరపడింది. అలా సంస్కృత భాషా ప్రభావం ఆ తర్వాత దశాబ్దకాలం పాటు చూపించింది తెలుగు సినిమాపేర్ల మీద. దీనికి ‘పృథ్వీపుత్ర’ (1933), ‘కుచేల’ (1935), ‘హరిశ్చంద్ర’ (1935), ‘వీరాభిమన్యు’ (1936) వంటివి ఉదాహరణలు. ఆ తర్వాత 1944లో వచ్చిన ‘తాసీల్దార్’ సినిమాతో తెలుగు సినిమా పేర్లలో ఉర్దూ, పార్శీ భాషాపదాల జైత్రయాత్ర ప్రారంభమైంది. ఆనక ఉర్దూ, పార్శీ భాషలతో తెలుగుపదాలు కలగలిసిన మిశ్రమ పదాలు సినిమా పేర్లుగా ప్రాచుర్యం పొందాయి. 1957లో వచ్చిన ‘మాయా బజార్’ అనే సినిమా పదం ఉర్దూ/ పార్శీ పదం. ఆ సినిమా తర్వాత ఈ రెండూ ఒకటే అనేంతగా ఈ పదం ప్రాచుర్యం పొందింది. ఇక గత దశాబ్దకాలం నుంచి ఏకంగా హిందీ పదాలనే సినిమా పేర్లుగా పెట్టడం ఓ ఒరవడిగా మారిపోయింది. దిల్ (2003), ఖతర్నాక్ (2006), మస్కా, జోష్, ఏక్ నిరంజన్ (2009), బిందాస్, గోలీమార్ (2010), తీన్‌మార్ (2011), ఇష్క్ (2012) సినిమాల పేర్లే దీనికి మచ్చుతునకలు!
ఇంగ్లీష్ ప్రభావం
1991 తర్వాత మొదలైన ఆర్థిక సంస్కరణలు, యువత గ్లోబలైజేషన్ ధోరణులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల వంటి కారణాల వల్ల 2001 తర్వాత వచ్చిన యువత ఇంగ్లీష్ వాడకాన్ని రోజూవారీ వ్యవహారంలో భాగం చేసింది. అందువల్లే సినిమాలకు మహారాజపోషకులైన ఆ యువతను ఆకట్టుకోవడానికి సినిమా పేర్లలో ఇంగ్లీష్ అనివార్యమైంది. అయితే ఈ పోకడ తొలుత తెలుగు - ఇంగ్లీష్ మిశ్రమ పదాలతో మొదలైందని చెప్పాలి. 1955లో వచ్చిన ‘మిస్సమ్మ’ పేరు దీనికి మంచి దృష్ట్యాంతం. ఈ పేరులో మిస్ అనే ఇంగ్లీష్ పదం, అమ్మ అనే తెలుగు పదం ..ండిటినీ కలిపి ‘మిస్సమ్మ’గా చేశారు. ఇక 2000 సంవత్సరం తర్వాత నుంచి తెలుగు సినిమా పేర్లలో ప్రతియేటా దాదాపు 30, 35 సినిమాల పేర్లు ఇంగ్లీష్‌లోనే ఉంటున్నాయి. క్రిమినల్, డాడీ (2001), షో (2002) ఇడియట్ (2002), మాస్ (2004), సూపర్ (2005), స్టైల్, హ్యాపీ, షాక్, బాస్, హ్యాపీ డేస్ (2007), రెడీ (200pandu), కింగ్ (200pandu), కిక్, రైడ్, ఫిటింగ్ మాస్టర్ (2009), లీడర్, డార్లింగ్, ఆరెంజ్ (2010), మిస్టర్ పర్‌ఫెక్ట్, ఓ మై ఫ్రెండ్ (2011), బిజినెస్‌మేన్, బాడీగార్డ్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, రెబల్, బస్‌స్టాప్ (2012)వంటివి పూర్తిగా ఇంగ్లీష్ పేర్లే!
సామెతలు ఎక్కడ..
pandu2 ఏళ్ల తెలుగు సినీ చరివూతలో సినిమాపేర్లుగా ప్రాచుర్యంపొందిన మరో ధోరణి సామెతలను సినిమాలకు పేర్లుగా పెట్టడం. దీనివల్ల తెలుగు భాష మాత్రమే కాక తెలుగు జీవన సంస్కృతిలోని సామెతలు, సూక్తులు కూడా ప్రజాదరణ పొందాయి. కానీ ఇప్పుడు ఆ ధోరణి తెలుగు సినీ వెండితెరపై మచ్చుకైనా కనిపించడం లేదు. తెలుగు సినిమా పేర్లుగా సామెతలను పెట్టడం అనే ధోరణికి 1955లో వచ్చిన ‘చెరపకురా చెడేవు’ సినిమా శ్రీకారం చుట్టింది, ఆ తర్వాత ఈ ధోరణి ‘ఎత్తుకు పై ఎత్తు’ (195pandu), ‘అప్పుచేసి పప్పుకూడు’ (1959), ‘నిత్య కళ్యాణం పచ్చతోరణం’ (1960), ‘కలసి ఉంటే కలదు సుఖం’ (1961), ‘ఇంటికి దీపం ఇల్లాలు’ వంటి సామెతలకు విస్తరించింది. ఇవేకాక ‘డబ్బుకు లోకం దాసోహం’ (1973), ‘ఎవరికివారే యమునా తీరే’ (1974), ‘సొమ్మొకడిది సోకొకడిది’, ‘కోరికలే గుర్రాలైతే’ (1979) వంటివి సినిమాలుగా వచ్చాయి. అయితే 1990వ దశకం తర్వాత వచ్చిన యువతరం ప్రేక్షకులలో ఈ సామెతల పేర్లలో నవ్యత కనిపించకపోవడం, సినిమాని సందేశాల కోసం కాకుండా కేవలం వినోదం కోసమే చూసే జనాల సంఖ్య పెరగడం వంటి కారణాలవల్ల ఈ తరహా సినిమాపేర్లు ఇప్పుడు తెలుగుతెరపై కనుమరుగైపోయాయి.
తమిళ ఫార్ములా..
ఇప్పుడు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే పేరును ప్రకటించినప్పటి నుంచి మళ్లీ తెలుగు సినీరంగంలో తెలుగు సినిమా పేర్ల దిశగా ఆలోచన మొదలైంది. కాట్రగడ్డ మురారి వంటి సీనియర్ నిర్మాతలు, దాసరి వంటి దర్శకులు, అక్కినేని వంటి నటులు ఇప్పుడు తెలుగు సినిమా పేర్లను తెలుగులోనే పెట్టాలనే విషయాన్ని, విధివిధానాలను అదీ తమిళనాడు తరహాలో ఉండాలని వాదిస్తున్నారు. తమిళ సినిమాల పేర్లలో తమిళేతర పదాలుంటే ఆ సినిమాలపై అక్కడి ప్రభుత్వం పన్నులను విధిస్తున్నది. ఆ పన్నును తప్పించుకోవడానికైనా అక్కడి సినీ నిర్మాత, దర్శక హీరోలు తప్పనిసరిగా తమిళ పేర్లనే పెడ్తున్నారు. మన తెలుగు సినీరంగంలో కూడా ఈ తరహా నిర్ణయాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. అంతేగాక సంక్రాంతి పండుగ ముగ్గుతోనే ఆరంభమైనట్టు మన తెలుగు సినిమాకు నిజమైన సంక్రాంతి... తెలుగు పేర్లతో సినిమాలు వచ్చినప్పుడే అనే విషయాన్ని పరివూశమలోని అందరూ గుర్తించడం తక్షణావసరం.
అయితే మాస్‌మసాలాలతో ప్రేక్షకుల మానసిక దౌర్భల్యాలతో ఆడుకుంటూ సామాజిక స్పృహ అనే మాట వింటేనే ఆమడదూరం పరుగెడుతూ సొమ్ముచేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న తెలుగు సినీపరిక్షిశమ సామాజిక బాధ్యతని ఎంతవరకు స్వీకరిస్తుంది? ఇది పదహారణాల తెలుగు ప్రశ్న!