గువ్వ గూడు చేరె కొంగ కొమ్మ చేరె
అయినా నిదుర రాదే..
దూడే పొదుగు చేరె అవ్వే అరుగు చేరె
అయినా నిదుర రాదే..
పగలంతా పని చేసినా
సూరీడల్లే దుప్పట్లొ దూరేయ్
దిగులంతా కరిగించగా
చందురుడొచ్చి వెన్నెల కురిపించే..
రావే రావె నిదురా..
కలతల్ని దాటుకొని రా..
రావే రావె నిదురా..
కలలన్ని మోసుకొని రా..
దోబూచులాడే మా దొరసాని
దొరికే వరకే నీ వేషాలు కాని
చుక్కల మాటున నక్కావా మా అమృత రాణి
ఎక్కడ దాక్కుని ఉన్నావే అలివేణీ
కంచికి చేరని కథలెన్నో చెబుతా నీకన్నీ
కన్నులు మూసుకొని పడుకోవే అమ్మణీ..
మారం చెల్లదంటు గారం ఒళ్లదంటు
పోవే నిదుర పోవే..
మాయే చల్లుకుంటు హాయే అల్లుకుంటు
రావే నిదుర రావే..
చిత్రం : కిరాక్ (2014)
సంగీతం : అజయ్ అరసాడ
రచన : వశిష్ట శర్మ
గానం : నిత్య సంతోషిని
*********************************************
Guvva goodu chere konga komma chere
ayinaa nidura raade..
doode podugu chere avve arugu chere
ayinaa nidura raade..
pagalanthaa pani chesinaa
sooreedalle duppatlo doorey
digulanthaa kariginchagaa
chandurudocchi vennela kuripinche..
raave raave niduraa..
kalathalni daatukoni raa..
raave raave niduraa..
kalalanni mosukoni raa..
Doboochulaade maa dorasaani
dorike varake nee veshaalu kaani
chukkala maatuna nakkaavaa maa amrutha raani
ekkada daakkuni unnaave alivenii
kanchiki cherani kathalenno chebuthaa neekanni
kannulu moosukoni padukove ammanii..
maaram chelladantu gaaram olladantu
pove nidura pove..
maaye challukuntu haaye allukuntu
raave nidura raave..
Movie Name : Kiraak (2014)
Music Director : Ajay Arasada
Lyricist : Wasistha Sharma
Singer : Nithya Santhoshini