గాలే నిన్ను తాకిగాని నన్ను చేరనంది
ఊపిరంత ఆగేలా..
ఈ భూమే వద్దు అంటు పైకి చేరి
రంగులద్దుకుంది మనసు వాన విల్లులా..
వాలుగా జడే వాలగా
నా కన్ను రెప్ప వేయనంది చేప పిల్లలాగా
ఓరగా నువ్వే చూడగా
నా ఈడు ఆగనంది జింక పిల్ల లాగా
గోడ నుంది జారిపడ్డ పిల్లి పిల్ల తీరుగా
గుండె ఆగి కొట్టుకుంది కొత్తగా
కాలి కింద పాల పుంత వచ్చి చేరినట్టుగా
ఉంది నువ్వు నవ్వుతుంటె హాయిగా..
కళ్లు కావవి కసక్కుమన్నవి
కోత నేర్చుకున్న కత్తులా..
కురులు కావవి కిరాకుగున్నవి
నల్ల త్రాచు జంట మెలికలా..
ఆటల్లొ తేనెపట్టు దాచావో..
నవ్వుల్లొ పూల బాట వేసావో..
ఒంపుల్లొ ఒంటిమిట్ట దోచావో..
టెంపుల్ లొ దేవి లాగ నన్ను కనికరించావో
గూటి లోన రెక్క రాని చిట్టి పాలపిట్టలా
బిక్కు బిక్కుమంది గుండె కొత్తగా..
ఒక్కసారి ఓరకంట చూసి నువ్వు నవ్వగా
రెక్కలొచ్చి దిక్కులన్ని చుట్టదా..
చూపులా అవి చురుక్కుమన్నవి
లేత మబ్బు లోని మెరుపులా..
చెంపలా అవి చమక్కుమన్నవి
సిగ్గు పడ్డ మిరప ఎరుపులా..
చంద్రున్ని పాల ముంచి తీసాడో..
వెన్నెల్లొ సున్నితాలు పూసాడో..
బంగారు వన్నెలద్ది గీసాడో..
అందాలు గుమ్మరించి బొమ్మ నిన్ను చేసాడొ
సోయగాల గాలమేసి లాగకే వరూధిని
ఆత్రమాగలేని బ్రహ్మచారినీ..
నీ గాలి సోకి గోల చేసి గాయపడ్డ గుండెని
చెంత చేరి ఆదుకో సిమా మణి..
చిత్రం : కిరాక్ (2014)
సంగీతం : అజయ్ అరసాడ
రచన : వశిష్ట శర్మ
గానం : హేమచంద్ర
*********************************************
Gaale ninnu thaakigaani nannu cheranandi
oopirantha aagelaa..
ee bhoome vaddu antu paiki cheri
ranguladdukundi manasu vaana villulaa..
vaalugaa jade vaalagaa
naa kannu reppa veyanandi chepa pillalaagaa
oragaa nuvve choodagaa
naa eedu aaganandi jinka pilla laagaa
goda nundi jaaripadda pilli pilla theerugaa
gunde aagi kottukundi kotthagaa
kaali kinda paala puntha vacchi cherinattugaa
undi nuvvu navvuthunte haayigaa..
Kallu kaavavi kasakkumannavi
kotha nerchukunna katthulaa..
kurulu kaavavi kiraakugunnavi
nalla thraachu janta melikalaa..
aatallo thenepattu daachaavo..
navvullo poola baata vesaavo..
ompullo ontimitta dochaavo..
temple lo devi laaga nannu kanikarinchaavo
gooti lona rekka raani chitti paala pittalaa
bikku bikkumandi gunde kotthagaa..
okkasaari orakanta choosi nuvvu navvagaa
rekkalocchi dikkulanni chuttadaa..
Choopulaa avi churukkumannavi
letha mabbu loni merupulaa..
chempalaa avi chamakkumannavi
siggu padda mirapa erupulaa..
chandrunni paala munchi theesaado..
vennello sunnithaalu poosaado..
bangaaru vanneladdi geesaado..
andaalu gummarinchi bomma ninnu chesaado
soyagaala gaalamesi laagake varudhini
aathramaagaleni brahmachaarinii..
nee gaali soki gola chesi gaayapadda gundeni
chentha cheri aaduko simaa mani..
Movie Name : Kiraak (2014)
Music Director : Ajay Arasada
Lyricist : Wasistha Sharma
Singer : Hema Chandra