పంటచేలో పాలకంకి నవ్విందీ
పల్లకీలో పిల్ల ఎంకి నవ్విందీ
పూత రెల్లు చేలు దాటే ఎన్నెల్లా
లేతపచ్చ కోనసీమ ఎండల్లా
అమ్మాడి నవ్వవే గుమ్మాడి నవ్వవే
గుమ్మాడి పువ్వులాగ అమ్మాడి నవ్వవే
॥॥
చరణం : 1
శివ గంగ తిరనాళ్లలో
నెలవంక స్నానాలు చెయ్యాలా
చిలకమ్మ పిడికిళ్లతో
గొరవంక గుడిగంట కొట్టాలా
నువ్వు కంటి సైగ చెయ్యాలా
నే కొండ పిండి కొట్టాలా
మల్లి నవ్వే మల్లెపువ్వు కావాలా (2)
ఆ నవ్వుకే ఈ నాపచేను పండాలా
॥॥
చరణం : 2
గోదారి పరవళ్లలో
మా పైరు బంగారు పండాలా
ఈ కుప్ప నూర్పిళ్లతో మా ఇళ్లు వాకిళ్లు నిండాలా
నీ మాట బాట కావాలా
నా పాట ఊరు దాటాలా
మల్లిచూపే పొద్దుపొడుపై పోవాలా (2)
ఆ పొద్దులో మా పల్లె నిద్దర లేవాలా
॥॥
చిత్రం : పదహారేళ్ళ వయసు (1978)
సంగీతం : చక్రవర్తి
రచన : వేటూరి
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి
***************************************************
Movie Name : Padaharella Vayasu (1978)
Music Director : Chakravarthy
Lyricist : Veturi Sundararama Murthy
Singers : S.P.Balu, S.Janaki