పల్లవి :
ఏదో మనసు పడ్డానుగానీ
కల్లో కలుసుకున్నాను గానీ
నీపై ప్రేమా ఏమో నాలో
ఏదో మనసు పడ్డానుగానీ
ఎంతో అలుసు అయ్యాను గానీ
నాపై ప్రేమో ఏమో బోలో
రావా పడుచు మది తెలుసుకొనలేవా...
తలపునపడు తనువు ముడి మనువై
మమతై మనదైపోయె అనురాగాలు కలనే
॥మనసు॥
చరణం : 1
ఒక హృదయం పలికినది
జతకోరే జతులు శ్రుతులు కలిపి
ఒక పరువం పిలిచినది ప్రేమించి...
ఒక అందం మెరిసినది ఎదలోనే చిలిపి వలపు చిలికి
ఒక బంధం బిగిసినది వేధించి...
తె లుసా తేటిమనసా పూలవయసేమంటుందో
తెలిసి చంటి మనసే కంటి నలుసై పోతుందో
ఓ భామా రమ్మంటే నీ ప్రేమా బాధే సరి
మెడ ఉరి గడుసరి సరిసరిలే
॥మనసు॥
చరణం : 2
ఒక మురిపెం ముదిరినది మొగమాటం
మరిచి ఎదుట నిలిచి
ఒక అధరం వణికినది ఆశించి
ఒక మౌనం తెలిసినది నిదురించి కలలు కనుల నిలిపి
ఒక రూపం అలిగినది వాదించి
బహుశా బావ సరసాలన్నీ విర సాలాయెనేమో
ఇక సాగించు జతసాగించు మనసే ఉన్నదేమో
ఓ పాపా నిందిస్తే నా పాపం
నాదేమరి విధిమరి విషమని మరి తెలిసే
॥మనసు॥
చిత్రం : అమ్మదొంగా (1995)
సంగీతం : కోటి
రచన : వేటూరి సుందరరామ మూర్తి
గానం : మనో, కె.ఎస్.చిత్ర, శైలజ
***************************************************
Movie Name : Amma Donga (1995)
Music Director : Koti
Lyricist : Veturi Sundararama Murthy
Singers : Mano, K.S.Chitra, Sailaja