• Home
  • Error Page
  • Privacy Policy
  • Disclaimer
  • About
  • f
  • t
  • g+
Cinema Song Lyric

  • News
  • Gadget
    • Blackberry
      • Curve
      • Gemini
      • Bold
    • HTC
    • Samsung
    • Spesifikasi
  • Internet
    • Facebook
    • Google
    • Twitter
  • Operating System
    • Android
    • Apple
    • Blackberry
  • Blogger
    • Widgets
    • Tips
    • Templates
  • Health
Home » Lyricists Biography » అనిసెట్టి సుబ్బారావు

అనిసెట్టి సుబ్బారావు

సవ్యసాచి:  నిదుర పో... నిదుర పో... నిదుర పో
నిదురపోరా తమ్ముడా
 నిదురలోన గతమునంతా
 నిముసమైన మరచిపోరా...
 చందురుని మించు అందమొలికించు
 ముద్దు పాపాయినే
 చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుకా
 మధురాశలు పలికేనో నా మనసున చిలికేనో
 ఆపాత మధురాలైన ఇలాంటి పాటల్ని వినని, గుర్తుంచుకోని తెలుగు సినీ సాహిత్య ప్రియులుండరు. అందులోనూ ‘సంతానం‘ చిత్రంలోని ‘నిదుర పోరా’ పాటను లతా మంగేష్కర్ పాడిన మొదటి తెలుగు సినిమా పాటగా స్మరించని వాళ్లుండరు. అయితే ఈ పాటలన్నీ అనిసెట్టి రాశారని అందరికీ తెలియకపోవచ్చు.

 అనిసెట్టి పూర్తి పేరు అనిసెట్టి సుబ్బారావు (1922). శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి, డా. సి.నారాయణరెడ్డి వంటి సినీ కవులలాగే సినీరంగ ప్రవేశానికి ముందే అభ్యుదయకవిగా ప్రసిద్ధులు. ‘అగ్నివీణ’, ‘బిచ్చగాళ్ల పదాలు’ వంటి కావ్యాలు... ‘గాలిమేడలు’, ‘మాఊరు’ నాటకాలు, ‘చెప్పు కింద పూలు’, ‘చరమాంకం’ నాటికలు మొదలైనవి అనిసెట్టి పేరు చెప్పగానే చప్పున స్ఫురించే రచనలు. అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడక ముందే నవ్య కళాపరిషత్తు ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత అ.ర.సం కార్యవర్గ సభ్యుడిగా 1973లో అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం కార్యదర్శిగా అభ్యుదయ కవిత్వంతో పరిచయమున్న వాళ్లెవరూ అనిసెట్టిని మర్చిపోరు. అనిసెట్టి సాహిత్యంపై ఇది వరకే వివిధ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగాయి. కాని అనిసెట్టి సినీరచనలపై సమగ్ర పరిశీలన జరగలేదు.

 అనిసెట్టి 1952లో గిడుతూరి సూర్యం ప్రోత్సాహంతో ‘ప్రియురాలు’ చిత్ర రచయితగా సినీరంగంలో అడుగుపెట్టి  ‘శ్రీకృష్ణ లీలలు’ (1956), ‘కొండవీటి దొంగ’ (1958) అనువాద చిత్రాలతో ఆ రంగంలో నిలదొక్కుకున్నారు. శ్రీశ్రీ, ఆరుద్రల తర్వాత ఆ రంగంలో తన స్థానాన్ని పదిలపర్చుకున్నారు. అనిసెట్టి రచయితగా పని చేసిన సుమారు 130 చిత్రాలలో డెరైక్ట్ చిత్రాలు 40 కాగా మిగిలినవన్నీ అనువాదాలే. అనువాదాల్లో ఆరుద్ర లిప్‌సింక్ కంటే తెలుగుదనానికి ప్రాధాన్యం ఇస్తే అనిసెట్టి లిప్‌సింక్‌ని నిర్లక్ష్యం చేయకుండా వీలయిన వరకు మూలంలోని భావాలను కూడా అనువదిస్తూ అనువాద రచనను అసిధారవ్రతంలా నిర్వహించారు. అనిసెట్టి అనువాదం చేసిన సినిమాల్లో ‘కొండవీటి దొంగ’, ‘మావూరి అమ్మాయి’, ‘పాప పరిహారం’ ‘మాయామశ్చీంద్ర’, ‘సర్వర్ సుందరం’, ‘లోకం చుట్టిన వీరుడు’ మొదలైనవి పేరు తెచ్చాయి. మలయాళంలో వచ్చిన మొట్టమొదటి ‘స్వామి అయ్యప్ప’ సినిమాకు తెలుగు అనువాదం అనిసెట్టే. ఆ పాటలు నేటికి అయ్యప్ప భక్తుల కార్యక్రమాల్లో వినబడుతుంటాయి. ఆయన అనువాదం చేసిన ‘కొండవీటి దొంగ’లోని పాటల్లో తెలుగుదనం చూడండి.
 సాహసమే జీవితపు బాటరా
 సత్యమే నీ లక్ష్యమని చాటరా
     తమలపాకు సున్నమూ
     పడుచువాళ్లకందమూ
 ఒక్కడికీ ఇద్దరయా
 ఇవి కలికాలపు బుద్ధులయా...
 ఇవి వింటే అనువాదమని అనుకోరు. ఇక భీమ్‌సింగ్ దర్శకత్వంలో వచ్చిన  ‘పాలుం పశముం’ (1961) తమిళ చిత్రం తెలుగులో ‘ప్రాయశ్చిత్తం’గా అనువాదమైతే తమిళంలోని కన్నదాసన్ మాతృరచనకు అనిసెట్టి అద్భుతమైన తెలుగు అనువాదం చేశారు. ఆ పాట-
 పోతే పోనీ పోరా
 ఈ పాపపు జగతీ శాశ్వతమెవరురా...
 ఈ పాటలోని తాత్త్విక వాక్యాలు చూడండి.
 జీవితమే ఒక స్వప్నమహో
 మన జననం కమ్మిన నిద్దురహో
 ఇట మరణం ఆత్మకు వేకువహో...
 తమిళంలో ఎలా ఉన్నా తెలుగులో ఇది ఉన్నత సాహిత్య రూపం తీసుకుంది. ఇది అనిసెట్టి ఘనత.  భీమప్రతిజ్ఞ (1965)లో ఆయన రాసిన పాట అనువాదంలో కూడా సాహిత్యవిలువ తేవచ్చనడానికి ఉదాహరణ.
 వీచెను కాలపు సుడిగాలి
 అది విసరెను బాధల పెనుధూళి
 విధికి లేదులే ఏ జాలి
 ఆ విధాతకిదియే ఒక కేళి...
 ‘కళత్తూర్ కన్నమ్మ’ తెలుగులో ‘మావూరి అమ్మాయి’గా అనువాదం అవగా అందులో అనిసెట్టి రాసిన-
 కనిపెంచు తల్లీ కాపాడుతండ్రీ
 ఆపదలో ఆదరించు దైవము నీవే
 పాట అదే ఇతివృత్తంతో తీసిన ‘మూగనోము’ కోసం ఆరుద్ర రాసిన
 తల్లివి నీవే తండ్రి నీవే/ చల్లగ కరుణించే దైవము నీవే
 పాటకు స్ఫూర్తి కావడం అనిసెట్టికి గర్వకారణం.
 అనిసెట్టి 1979 డిసెంబర్ 27న నరసరావు పేటలో 57 సంవత్సరాల వయసులో చనిపోయారు. ఆయన ఖాళీ అన్నది ఎరగరు. మధ్యలో రెండు సంవత్సరాల గ్యాప్ వచ్చినా మళ్లీ ‘సర్వర్ సుందరం’తో విజృంభించారని అంటారు. తన స్వీయ నిర్మాణంలో తీసిన ‘మన ఊరు’ ఆయన చివరి సినిమా. అనిసెట్టి ఒక మంచికిగాని చెడుకుగాని బయటకు వెళ్లేవారు కాదట. ఇంట్లోనే రాసుకుంటూ కూర్చునేవారట. ఏవిఎం, దేవర్ ఫిలిమ్స్‌కు ఆయన పర్మినెంట్ రైటర్. పదిహేను రోజులకో సినిమా ముగించేవారు.
 అనువాద చిత్రాలనూ, పాటలనూ ద్వితీయ శ్రేణికి చెందినవిగా కొందరు భావించినా, అనువాద రచనను కొందరు రచయితలు జీవిక కోసమే స్వీకరించినా అనువాద రచన కూడా అంకిత భావంతో స్వీకరించి దాని గౌరవాన్ని పెంచిన కొద్దిమంది రచయితల్లో అనిసెట్టి ఒకరు.
అనిసెట్టి సుబ్బారావు , Pada: 22.06

Share to

Facebook Google+ Twitter
Diposting oleh Unknown di 22.06

Related Posts

0 komentar :

Posting Komentar

« Next Prev »

Most Popular

  • ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం.....        ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం..... ఆ నలుగురు (2004)
    ఒక్కడై రావడం...ఒక్కడై పోవడం...నడుమ ఈ నాటకం విధిలీల వెంట ఏ బంధమూ...రక్త సంబంధమూ...తోడుగా రాదుగా తుదివేళ మరణమనేది ఖాయమనీ...మిగిలెను కీర్తి కాయ...
  • అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ... దేవుళ్ళు (2001)
    రామా..ఆ..ఆ.. రామా..ఆ..ఆ.. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య ఆ ...
  • Pataas telugu movie songs lyrics
    Pataas telugu movie songs lyrics
    Movie : Pataas (2015) Cast : Nandamuri Kalyan Ram, Shruthi Sodhi Music : Sai Kartheek Lyrics : Bhuvanachandra, Sri Mani, B. Subbaraya Sharma...
  • Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Movie Name : Pilla Nuvvu Leni Jeevitham (2014) Cast: Sai Dharam Tej, Regina Cassandra Music Director: Anoop Rubens Lyrics : Bhaskarabhatla, ...
  • Yevade Subramanyam telugu movie songs lyrics
    Yevade Subramanyam telugu movie songs lyrics
    Movie : Yevade Subramanyam (2015) Cast: Nani, Malavika Nair, Vijay Devarakonda, Ritu Varma Music : Radhan Lyrics : Vasishta Sharma,  Directo...

Arsip Blog

  • ►  2015 (64)
    • ►  April (26)
    • ►  Maret (18)
    • ►  Februari (5)
    • ►  Januari (15)
  • ▼  2014 (410)
    • ►  Desember (18)
    • ►  November (13)
    • ►  Oktober (7)
    • ►  September (60)
    • ►  Agustus (87)
    • ►  Juli (22)
    • ►  Juni (34)
    • ▼  Mei (42)
      • అనిసెట్టి సుబ్బారావు
      • మనసే దోచావు నీవు మనిషే మిగిలాను నేను .......... అమ...
      • సన్నజాజి పందిరి కింద మెల్లమెల్లగా ........ సంఘర్షణ...
      • గది తలుపుల గడియలు బిగిసెను చూసుకో ........ మిరపకా...
      • ధినక్ ధిన్ జియా నీకు దిల్ దియా ........ మిరపకాయ్ (...
      • తేనెపాటల పూదోట
      • Lakshmi puthrudu telugu movie songs lyrics
      • తామరనై తామరనై ఒక తామర పువ్వు నేనై ......... లక్ష్మ...
      • ఎక్కడున్నా టెన్షన్ మామ ఎక్కడెల్లూ టెన్షన్ మామ .......
      • ఏం చూసి నన్నే నువ్ ప్రేమించేస్తున్నావ్ ........ లక...
      • జీ భూమ్ బా అమ్మో ........... లక్ష్మీ పుత్రుడు (2008)
      • నెలరాజా పరుగిడకు చెలివేచే నాకొరకు ... అమర గీతం (1982)
      • చెలీ రావా... వరాలీవా.. మౌన రాగం (1986)
      • Mitrudu telugu movie songs lyrics
      • ఆకాశం నుంచి మేఘాలే దిగి వచ్చి ............ మిత్రు...
      • Missamma telugu movie songs lyrics
      • నే పాడితే లోకమే పాడదా.. నే ఆడితే లోకమే ఆడదా... మిస...
      • మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ....... మైత్రి (2012)
      • Mirapakay telugu movie songs lyrics
      • గది తలుపుల గడియలు బిగిసెను చూసుకో ........ మిరపకా...
      • ధినక్ ధిన్ జియా నీకు దిల్ దియా ....... మిరపకాయ్ (...
      • చిరుగాలే వస్తే వస్తే వస్తూ వస్తూ వానే తెస్తే ........
      • సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా ....... మిరపకాయ్ ...
      • వైశాలి I'm ver very sorry అంటున్నా ఇంకోసారి I'm so...
      • అదిగోరా చూడు ఆకతాయిరో గిరి గీస్తే చాలు గీటు రాయిరో...
      • Mayadari malligadu telugu movie songs lyrics
      • వస్తా....వెల్లొస్తా ...మళ్ళెప్పుడొస్తా ? ...........
      • తుర్రుపిట్ట...త్రురుపిట్ట తోటచూస్తావా....... మాయదా...
      • వ్రేపల్లె వాడలో గోపాలుడే..నంద గోపాలుడె..... మాయదార...
      • తలకు నీళ్ళోసుకుని ... కురులారబోసుకుని .... మాయదార...
      • మల్లెపందిరి నీడలోన జాబిల్లి ....... మాయదారి మల్లి...
      • నవ్వుతూ బతకాలిరా.. తమ్ముడూ ......... మాయదారి మల్ల...
      • Mechanic Alludu telugu movie songs lyrics
      • చెక్కా చెక్కా చం చెక్కా తక్కా తక్కా తైతక్కా .........
      • ఝుమ్మనే తుమ్మెద వేట .. గుమ్మనే వలపుల తోట ..... మ...
      • గుంతలక్కిడి గుండమ్మో గుండెల్లో గుబా గుబా ........ ...
      • గురువా గురువా గుర్రమెక్కు గురువా ............. మెక...
      • ప్రేమిస్తే ప్రాణమిస్తా వంచిస్తే అంతు చూస్తా .........
      • దర్శకుడు - లక్ష్మీదీపక్
      • మన దర్శక నిర్మాత బి. నర్సింగరావు
      • బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.... జీవిత చక్రం (1971)
      • టి.కృష్ణ
    • ►  April (39)
    • ►  Maret (8)
    • ►  Februari (52)
    • ►  Januari (28)
  • ►  2013 (1026)
    • ►  Desember (108)
    • ►  November (93)
    • ►  Oktober (217)
    • ►  September (108)
    • ►  Maret (119)
    • ►  Februari (206)
    • ►  Januari (175)
  • ►  2012 (1500)
    • ►  November (186)
    • ►  Oktober (739)
    • ►  September (281)
    • ►  Agustus (294)

Mengenai Saya

Unknown
Lihat profil lengkapku
Diberdayakan oleh Blogger.
Copyright © 2014 Cinema Song Lyric Design by SHUKAKU4RT - All Rights Reserved