బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు గౌరమ్మ ఉయ్యాలో ॥ బతుకమ్మ॥
పసుపు కుంకుమ లిచ్చి ఉయ్యాలో
పాలించవే తల్లి ఉయ్యాలో ॥ బతుకమ్మ ॥
నా నోము పండింది ఉయ్యాలో
నీ నోము పండిందా ఉయ్యాలో
మా వారు వచ్చిరి ఉయ్యాలో
మీ వారు వచ్చిరా ఉయ్యాలో ॥ ॥
బావ నీ బావ వస్తాడు ఆగవే భామా
ఔనే అతడేనే అందాల చందమామా
బావ నా బావా వస్తాడు ఆగవే భామా
అవునే అతడేనే అందాల చందమామ ॥ ॥
మా బావ నవ్వితే మరు మల్లెలెందుకె
మా బావ తాకితే సిరివెన్నెల లెందుకె
నింగిని దిగి వస్తాడే
ముంగిట అగుపిస్తాడే
ఒక్కసారి చూశారా సొక్కి సోలిపోతారే ॥ ॥
ముత్యాల పందిరి వేయించమందువా
మేఘాల పల్లకి తెప్పించమందువా
వంటరిగా వస్తాడే జంటగా కొనిపోతాడే
ఊరిని మరిపిస్తాడే నీ వారిని మరిపిస్తాడే ॥ ॥
చిత్రం : జీవిత చక్రం (1971)
సంగీతం : శంకర్ - జైకిషన్ (తొలి తెలుగు చిత్రం)
రచన : సి. నారాయణ రెడ్డి
గానం : పి.సుశీల, బి. వసంత బృందం
**********************************************
Movie Name : Jeevitha Chakram (1971)
Music Director : Shankar- Jai Kishana (First Telugu Film)
Lyricist : C.Narayana Reddy
Singers : P.Susheela, B.Vasantha & Chorus