నూరేళ్ళకు చేరువవుతున్న ప్రపంచ చలనచిత్ర రంగ చరివూతలో కమర్షియల్ సినిమాకు భిన్నంగా, జీవితాలకు దగ్గరగా, సహజమైన సమాంతర సినిమాలను రూపొందించిన మహా దర్శకులు వేళ్ళ మీద లెక్కించ తగిన సంఖ్యలోనే ఉన్నారు.
మన సమాజంలో 0 శాతం ప్రేక్షకులను కమర్షియల్ సినిమా లాక్కుపోతుంది. మిగిలిన 20 శాతం మందిలో ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే న్యూవేవ్ సినిమాలను వీక్షిస్తున్నారు.
అమెరికా, యూరప్ దేశాలలో ఆర్ట్ సినిమాల కోసం ప్రత్యేక థియేటర్లు ఉన్నాయి. దురదృష్టవశాత్తు మనకు ఆ ఏర్పాటు లేదు.
సత్యజిత్‌రే, మృణాల్‌సేన్, ఆదూర్ గోపాలకృష్ణ, గౌతమ్ ఘోష్ వంటి దిగ్దర్శకులు భారతీయ చిత్రాలకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చి ప్రపంచ చలనచిత్ర శిఖరం మీద మన భారతీయ సినిమాకు గుర్తింపునిచ్చారు. ఆ కోవలో మూడు దశాబ్దాల క్రితమే సినీ రంగవూపవేశం చేసిన నూరణాల తెలంగాణ బిడ్డ మన బి.నర్సింగరావు.
ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ‘కళ ప్రజలకోసమే’ అని బలంగా విశ్వసిస్తారు. తనదైన శైలిలో, నిబద్ధతతో సినిమా మాధ్యమాన్ని శక్తివంతంగా వాడుకుని భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరుగా ఎదిగారు. భారీ నిర్మాణ వ్యయం, ప్రచార ఆర్భాటం తప్ప రాష్ట్రం ఎల్లలు కూడా దాటని తెలుగు చిత్రాన్ని ‘మాభూమి’, ‘రంగుల కల’, ‘దాసి’, ‘మట్టి మనుషులు’ వంటి సమాంతర సినిమాలను నిర్మించి ‘మన వెండి వెలుగుల’ కీర్తి ప్రతిష్టలను అంతెత్తుకు పెంచిన ముద్దుబిడ్డ. ఒక్క మాటలో తెలుగు ‘రే’గా కీర్తించబడిన దర్శక, నిర్మాత మన బి. నర్సింగరావు.
రాష్ట్ర ప్రభుత్వం, ఇటీవల లలిత కళాతోరణంలో నిర్వహించిన ‘నంది అవార్డుల కార్యక్షికమంలో అలనాటి మేటి దర్శకులు బి.యన్.డ్డి అవార్డును 2010 సంవత్సరానికి గాను బి. నర్సింగరావుకు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రస్థానంపై ‘బతుకమ్మ’ ప్రత్యేక వ్యాసం...
ఈ ఉగాదికి ‘మాభూమి’ విడుదలై 32 సంవత్సరాలు. సరిగ్గా అదే రోజు నర్సింగరావు ‘బి.ఎన్.డ్డి పురస్కారం’ అందుకోవడం నిజంగానే విశేషం. ఆంధ్రా, తెలంగాణ అనే భేదం లేకుండా ‘శంకరాభరణం’ సినిమా ఆడిన థియేటర్లలోనే రెండు వందల రోజులు నడిచిన ‘మాభూమి’ తెలుగు చలన చిత్ర రంగంలోనే ఒక చారివూతాత్మకమైన విజయాన్ని నమోదు చేసుకుంది.
~ ‘దాసి’ సుదర్శన్
మృణాల్ సేన్, సత్యజిత్ రే, శ్యాంబెనగల్, ఆదూరి గోపాలకృష్ణన్, గౌతమ్ ఘోష్ వంటి భారతీయ దర్శకులు నర్సింగరావుకు స్ఫూర్తి. ఆ స్ఫూర్తితో మొదటినుండి జీవితాన్ని ప్రతిబింబించే వాస్తవ చిత్రాలనే రూపొందించారాయన.
‘‘సమస్యాత్మక ఇతివృత్తాలతో సినిమా తీయడం ఒక బాధ్యతగా భావిస్తాను. సమస్యల మధ్య జీవిస్తూ ఎంతో సేపు ఊహా ప్రపంచంలో ఉండలేం. కొన్ని జీవితాలు చూసి కవిత్వం రాసినట్లే నేను చిత్రాలుగా మలుస్తాను. జీవితాన్ని నటన అనుకరిస్తుంది, నటనను జీవితం అనుకరించదు. నటనే అయినా కళాత్మక సినిమా జీవితాన్ని దగ్గరగా చూపుతుంది. కమర్షియల్ సినిమా తీయడం చిన్న విషయమేమి కాకపోవచ్చు. కానీ, నేను దాని జోలికి వెళ్లను. ఆర్టు మూవీ తీయడమే నాకు తెలుసు’’ అని వినవూమంగా చెపుతారు నర్సింగరావు. ఇదీ ఆయన నిబద్ధత.
‘‘ప్రపంచమంతా వందలు, వేల సంఖ్యలో కమర్షియల్ సినిమాల ఉధృతి కొనసాగుతున్నప్పటికీ తార్కోవిస్కి, అకిరా కురుసోవా, బెర్గ్‌మెన్, ఐజన్ స్టీన్ వంటి మహామహుల సినిమాలే ప్రపంచ సినిమా ప్రియుల మదిలో ఆజరామర కళాఖండాలుగా నిలిచి ఉన్నాయి. కమర్షియల్ సినిమాకు డబ్బు వచ్చినా అది నీటి బుడగే’’ అని ఆర్టు ఫిలిం గొప్పతనాన్ని మనకు వివరిస్తారు నర్సింగరావు. ఇదీ ఆయన దృష్టి కోణం.
మాభూమి:ప్రముఖ దర్శకులు మృణాల్‌సేన్, శ్యాం బెనగల్ తెలుగులో ‘ఒక ఊరి కథ’, ‘అనుక్షిగహం’ అనే సినిమాలు తీసారు. అవి రెండూ ఫ్లాప్ అయినవే ఆ తర్వాత వచ్చిన మరో రెండు వాస్తవ చిత్రాలు ‘హరిజన్’, ‘ప్రత్యూష’ రిలీజ్‌కు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో వాస్తవిక చిత్రాన్ని ఎలాగైనా నిలబెట్టాలనే పట్టుదలతో 1945 నాటి తెలంగాణ సాయుధ పోరాట ఇతివృత్తంతో కిషన్ చందర్ రాసిన ‘‘జబ్ ఖేద్ జాగ్‌తేరహే’’ (పొలాలు మేల్కొన్నప్పుడు) నవలను గౌతం ఘోష్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ రవీంవూదనాథ్ వంటి మిత్రులతో కలిసి నర్సింగరావు 1979లో ‘మాభూమి’ సినిమాను నిర్మించారు. ఆంధ్రా, తెలంగాణ అనే భేదం లేకుండా ‘శంకరాభరణం’ సినిమా ఆడిన థియేటర్లలోనే రెండు వందల రోజులు నడిచిన ‘మాభూమి’ తెలుగు చలన చిత్ర రంగంలోనే ఒక చారివూతాత్మకమైన విజయాన్ని నమోదు చేసుకుంది.
‘మాభూమి’ చిత్రానికి నర్సింగరావు ఒక నిర్మాత, సహాయ దర్శకుడు, ప్రధాన పాత్రధారి కూడా. మహోత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని వెండితెర కెక్కించి, పోరాట చరివూతను అజరామరం చేసారు. కమర్షియల్‌గా, మ్యూజికల్‌గా (గద్దర్ పాటలతో) సూపర్ హిట్టయిన ‘మాభూమి’ చిత్రానికి ఏ అవార్డు రాకున్నా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచింది.
రంగుల కల: కళా ప్రపంచంలో మునిగిన సున్నిత మనస్కుడైన ఓ ఆర్టిస్టు పేదరికం, ఆకలి, నిరుద్యోగం... దైనందిన సమస్యలతో సతమతమవుతూనే తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి ఆ ఆర్టిస్టుపడే అంతర్మధనం, స్పందనే ‘రంగుల కల’. 193లో విడుదలైన ఈ సినిమాకు కథ, సంగీతాన్ని అందించడంతో పాటు నర్సింగరావుగారు ప్రధాన పాత్రధారి, దర్శకులు కూడా. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘రంగుల కల’కు జాతీయ బహుమతి కూడా లభించింది.
దాసి: ఒకప్పటి నిజాం పరిపాలనలోని ఫ్యూడల్ శక్తుల అరాచక ధోరణిని, ‘దాసి’ వ్యవస్థలో స్త్రీలు గడిపిన దుర్భర జీవితాలనూ సరికొత్త సెల్యూలాయిడ్ భాష ద్వారా 19లో ‘దాసి’ చిత్రం అపూర్వంగా ఆవిష్కరించింది. జాతీయ స్థాయిలో ఈ సినిమా ఐదు అవార్డులు గెలుచుకుని సంచలనం సృష్టించింది. అంతర్జాతీయంగా ఇరవై చిత్రోత్సవాలలో ప్రదర్శనకు ఎన్నో అవార్డులూ, ప్రశంసలూ పొందింది. ఆస్ట్రేలియా, యూరప్ ఖండాలలో మూడుసార్లు టెలికాస్ట్ అయింది. మనాలీలో ఐ.ఏ.ఎస్., ఐ.పీ.ఎస్. అధికారుల శిక్షణా సిలబస్‌లో ‘దాసి’ ఒక సబ్జెక్టు.
మట్టి మనుషులు: పల్లె నుండి నగరానికి వలస వచ్చి, భవన నిర్మాణ కార్మికులుగా పొట్టపోసుకుంటూ, రియల్ ఎస్టేట్ వ్యాపారుల పదఘట్టన కింద నలిగిపోయిన ఓ పల్లెటూరి జంట జీవితాన్ని 1990లో ‘మట్టిమనుషులు’ చిత్రంగా మలిచారు నర్సింగరావు. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘మట్టి మనుషులు’ చిత్రానికి జాతీయ బహుమతి లభించింది. అమెరికాలో అన్ని విశ్వవిద్యాలయాల్లో కమ్యూనికేషన్స్, సినిమా కళను అభ్యసించే విద్యార్థులకు ‘మట్టి మనుషులు’ సినిమాను ప్రత్యేక అధ్యయన చిత్రంగా ప్రదర్శించారు. ఈ సినిమా గురించి ‘ది డైలీ’ పత్రిక రాస్తూ, ‘‘కఠోరమైన జీవిత వాస్తవాలను 7 నిముషాల ఈ చిత్రంలో చూడోచ్చని’’ ప్రశంసించింది. మాస్కో అంతర్జాతీయ చిత్రోత్సవంలో ఈ సినిమా ప్రదర్శించినప్పుడు ప్రసిద్ధ పత్రిక ‘ప్రావ్దా’ ‘‘ఈ చిత్రంలో నర్సింగరావు దర్శకత్వ ప్రతిభ ప్రతి ఫ్రేంలో కనిపిస్తుంది’’ అని ప్రశంసించింది.
మా వూరు: 1950ల నాటి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు, పండగలు, జానపద కళలకూ, ఆటపాటలకూ, జీవన విధానానికి అద్దం పట్టిన అద్భుత దృశ్యకావ్యం ‘మావూరు’. ఇది డాక్యుమెంటరీ చిత్రం. అంతరించి పోతున్న తెలంగాణ జానపద కళలు, శారదగాళ్ళు, చిడతల రామాయణం, దొమ్మరాట, గంగిద్దులాట ఇత్యాది కళలన్నింటినీ ‘మావూరు’ చిత్రం ద్వారా బి.నర్సింగరావు ముందు తరాల కోసం రికార్డు చేసిన విధానం అపూర్వం. ఆంథ్రోపాలజీ విభాగంలో 199లో ‘మా వూరు’ డాక్యుమెంటరీకి జాతీయ బహుమతి లభించగా, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఈ చిత్రాన్ని చూసిన అమెరికా డైరెక్టర్ ‘గాడ్ వూఫేరిగ్గో’ ఎంతో ముగ్ధులయ్యారు.
హరివిల్లు: ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడిగా పేరొందిన బి. నర్సింగరావు, అంతర్జాతీయ స్థాయి ఛాయా గ్రహకుడు ఏ.కె.బిర్, గిన్నీస్ రికార్టు క్రియేటర్ శతాధిక, బహుభాషా చిత్ర నిర్మాత డి. రామానాయుడు కాంబినేషన్‌లో మొట్టమొదటి అత్యాధునిక డిజిటల్ డాల్బీ సినిమాగా 2003లో ‘హరివిల్లు’ బాలల చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాకు కథ, దర్శకత్వం బి. నర్సింగరావే. 2003లో 34వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో కోల్‌కతా ఫిలిం ఫెస్టివల్లో, హైద్రాబాద్‌లో జరిగిన 13వ బాలల చిత్రోత్సవంలోనూ, 2004లో బంగ్లాదేశ్ ఢాకాలో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవంలో, అలాగే కైరోలో జరిగిన చిత్రోత్సవాలలో ‘హరివిల్లు’ ప్రదర్శన జరిగింది. ఈ సినిమాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి అవార్డుతో పాటు మరెన్నో ప్రతిష్టాత్మక బహుమతులు వచ్చాయి.
లఘు చిత్రాలు: ‘ది సిటీ’, ‘ఆకృతి’ వంటి లఘుచివూతాలను కూడా తనదైన ముద్రలో దర్శకులు బి. నర్సింగరావు గారు ఎంతో అందంగా నిర్మించి తెలుగు సినీ పరిక్షిశమలో తనదైన ముద్ర వేశారు.
‘ఆర్ట్ లవర్’ రంగులూ రాగాలు: 1971 ప్రాంతాల్లోనే నర్సింగరావు ‘ఆర్ట్ లవర్స్’ సంస్థను ప్రారంభించారు. వివిధ సామాజిక సమస్యలపై నాటకాలు, జానపద ప్రక్రియల ద్వారా ప్రదర్శనలిచ్చి ప్రజలను చైతన్యవంతం చేసారు. ‘జననాట్యమండలి’ ద్వారా ప్రజా వాగ్గేయకారుడు గద్దర్‌ను వెలుగులోకి తెచ్చారు. అన్నట్టు, వర్గీస్ పేరుతో మూడు దశాబ్దాల క్రితమే నర్సింగరావు ఎన్నో కవితలు, వ్యాసాలు రాసారు. జననం, అసావేరి, రంగులూ-రాగాలు తదితర గ్రంథాలనూ వెలువరించారు.
చిత్రకారుడు, ఫొటోక్షిగాఫర్ కూడా అయిన నర్సింగరావు పెయింటింగ్స్-ఫొటోక్షిగఫి ఎగ్జిబిషన్లు పలుమార్లు యూరప్ దేశాలలో, ఢిల్లీ వంటి మహా నగరాల్లో జరిగాయి.
నర్సింగరావు సేకరించిన హిందూస్తానీ, కర్నాటక జానపద సంగీతానికి సంబంధించిన అలనాటి వేలాది గ్రాంఫోన్ రికార్డులను సి.ఫెల్‌కు ప్రజెంట్ చేసారు.
తెలంగాణ ప్రాచీన సాహిత్యాన్ని, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విలువైన ‘యాంటిక్’ వస్తువులను పెద్ద ఎత్తున సేకరించిన నరసింగరావు వాటిని ప్రదర్శించడానికి మ్యూజియం ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు.
తెలంగాణ చరివూత, సాహిత్యంలో ఇప్పటి వరకు 10 గ్రంథాలకుపైగా ప్రచురించారు. తెలంగాణ రచయితలకు, కవులకు, సంకలన కర్తలకు నర్సింగరావుగారే పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు.
తెలంగాణ జిల్లాలలో ప్రముఖ చిత్రకారులు, ఔత్సాహికులతో తెలంగాణ ఇతివృత్తంలో పెయింటింగ్ వర్క్ షాపులు నిర్వహించి ప్రదర్శించడానికి సాయపడుతున్నారు.
మాస్కో అంతర్జాతీయ చిత్రోత్సవంలో ఈ సినిమా ప్రదర్శించినప్పుడు ప్రసిద్ధ పత్రిక ‘ప్రావ్దా’ పత్రిక ‘‘ఈ చిత్రంలో నర్సింగరావు దర్శకత్వ ప్రతిభకు ప్రతి ఫ్రేంలో కనిపిస్తుంది’’ అని ప్రశంసించింది.