ఎన్నో అలలు ఎన్నో నది మలుపులు
కలిసే కడకు కడలి ఒడిలోయలకు
ఎంతో దిగులు ఏవో చిరు అలకలు
చెదిరే తుదకు చిరునవ్వుల చిందులకు
కోపమే చెలియకు తగునా శాపమే అనుకోనా
ఆపవే గొడవలు లలనా
ఆయసం కలుగును తగువుల వలనా....
ఎన్నో అలలు ఎన్నో నది మలుపులు
కలిసే కడకు కడలి ఒడిలోయలకు
వీచే గాలి ఊపిరిగ మారుట
పూసే పువ్వు రాతిరికి వాడుట మామూలే.. ఒ ఒ ఓ..
నాలో ప్రేమ నీతోనే సాగుట
నా ప్రాణాలు నీ చెంత పోవుట నిజమేలే.. ఒ ఒ ఓ..
వెలివేసి వెలతానంటే ఒంటరిగా బ్రతకాలంటే బాధేలే...
వెనువెంటే ఉన్నావంటే వనవాసం వింతే కాదే హాయేలే.....
ఎన్నో అలలు ఎన్నో నది మలుపులు
కలిసే కడకు కడలి ఒడిలోయలకు
గుచ్చే కళ్ల బాణాలు చేసిన గాయాలన్ని
గుండెల్లొ మోసుకు తిరిగానే... ఒ ఒ ఓ..
వచ్చీ రాని సాహిత్యముందని
ముని పళ్లల్లొ నలిగేటి పెదవిని పొగిడానే... ఒ ఒ ఓ..
నీ కురులే పంపే గాలి కోపానికి సెలవంటోంది నిజమేనా....
నీ చూపుల సైగలు మళ్లీ పో పొమ్మని తరిమేసాయి అంతేనా...
ఎన్నో అలలు ఎన్నో నది మలుపులు
కలిసే కడకు కడలి ఒడిలోయలకు
ఎంతో దిగులు ఏవో చిరు అలకలు
చెదిరే తుదకు చిరునవ్వుల చిందులకు
కోపమే చెలియకు తగునా శాపమే అనుకోనా
ఆపవే గొడవలు లలనా
ఆయసం కలుగును తగువుల వలనా....
ఎన్నో అలలు ఎన్నో నది మలుపులు
కలిసే కడకు కడలి ఒడిలోయలకు
చిత్రం : చిత్రం చెప్పిన కథ (2014)
సంగీతం : మున్నాకసి
రచన : కరుణాకర్ అడిగర్ల
గానం : దినకర్
**********************************************
Yenno alalu yenno nadi malupulu
kalise kadaku kadali odiloyalaku
entho digulu evo chiru alakalu
chedire thudaku chirunavvula chindulaku
kopame cheliyaku thagunaa shaapame anukonaa
aapave godavalu lalanaa
aayasam kalugunu thaguvula valanaa....
yenno alalu yenno nadi malupulu
kalise kadaku kadali odiloyalaku
Veeche gaali oopiriga maaruta
poose puvvu raathiriki vaaduta maamoole.. o o o..
naalo prema neethone saaguta
naa praanaalu nee chentha povuta nijamele.. o o o..
velivesi velathaanante ontarigaa brathakaalante baadhele...
venuvente unnaavante vanavaasam vinthe kaade haayele.....
yenno alalu yenno nadi malupulu
kalise kadaku kadali odiloyalaku
Gucche kalla baanaalu chesina gaayaalanni
gundello mosuku thirigaane... o o o..
vacchi raani sahithyamundani
muni pallallo naligeti pedavini pogidaane... o o o..
nee kurule pampe gaali kopaaniki selavantondi nijamenaa....
nee choopula saigalu malli po pommani tharimesaayi anthenaa...
yenno alalu yenno nadi malupulu
kalise kadaku kadali odiloyalaku
entho digulu evo chiru alakalu
chedire thudaku chirunavvula chindulaku
kopame cheliyaku thagunaa shaapame anukonaa
aapave godavalu lalanaa
aayasam kalugunu thaguvula valanaa....
yenno alalu yenno nadi malupulu
kalise kadaku kadali odiloyalaku..
Movie Name : Chitram Cheppina Katha (2014)
Music Director : Munna Kasi
Lyricist : Karunakar Adigarla
Singer : Dinakar