జననం : 18-07-1972
అసలు పేరు : సౌమ్య
స్వస్థలం : గంగికుంట గ్రామం, ములబాగల్ తాలూకా, కొలర్ జిల్లా, కర్ణాటక
జన్మస్థలం : బెంగళూరు
చదువు : ఎం.బి.బి.ఎస్. మొదటి సంవత్సరం
తల్లిదండ్రులు : మంజుల, కె.ఎస్.సత్యనారాయణ
అన్నయ్య : అమర్‌నాథ్
వివాహం-భర్త : 27-04-2003, జి.ఎస్.రఘు
తొలిచిత్రం : గంధర్వ (కన్నడ-1992) మనవరాలి పెళ్లి (తెలుగు-1993)
ఆఖరిచిత్రం : ఆప్తమిత్ర (కన్నడ-2004) శివ్ శంకర్ (తెలుగు-2004)
నటించిన చిత్రాలు : దాదాపు 100 (తెలుగు, తమిళ, కన్నడ, మళయాళం)
నిర్మాతగా : ద్వీప (కన్నడ-2002)
అవార్డులు-పురస్కారాలు : ఉత్తమనటిగా ఐదు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు (అమ్మోరు, అంతఃపురం, రాజా, ద్వీప, ఆప్తమిత్ర), ఉత్తమ నిర్మాతగా (ద్వీప), కర్ణాటక ప్రభుత్వం నుండి నాలుగు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి మూడు నంది అవార్డులు, సినీపరిశ్రమకు సంబంధించిన మరెన్నో అవార్డులు అందుకున్నారు. తెలుగు సినీపరిశ్రమ ఆమె అద్భుతమైన నటనకు ‘నవరసనటమయూరి’ అనే బిరుదునిచ్చి సత్కరించింది.
ఇతర విషయాలు : అతితక్కువ కాలంలోనే మంచినటిగా గుర్తింపు తెచ్చుకున్నారు సౌందర్య. కన్నడ అమ్మాయి అయినా అచ్చతెలుగు ఆడపడచులా కనిపించే సౌందర్యను మహానటి సావిత్రితో పోల్చేవారు. ‘అమర సౌందర్య సోషియల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్’ ని స్థాపించి ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారు. ‘అమర సౌందర్య విద్యాలయ’ పేరుతో ఓ అనాథశ్రమాన్ని, పాఠశాలను స్థాపించారు. ప్రజాసేవ చేద్దామని బీజేపీలో చేరారు. పార్టీ ప్రచారం కోసం బెంగళూరు నుండి ఆంధ్రప్రదేశ్‌కు బయలుదేరుతుండగా విమాన ప్రమాదంలో ఆమె, ఆమె అన్న అమర్‌నాథ్ మరణించారు.