ఉదయించే కిరణంలా.. హృదయాలే తాకావు
చిత్రంగా మొదలయ్యి.. మనసుల్ని దోచావు
తెరపై కదిలే బొమ్మల్లే మాయే చేసావు
తెలుగై మెరిసే చుక్కల్లే మిన్నే చేరావు
ఉదయించే కిరణంలా.. హృదయాలే తాకావు
చిత్రంగా మొదలయ్యి.. మనసుల్ని దోచావు
తరగవులే.. గురుతుల నిధులు ఎన్నాళ్లకి
కరగవులే.. తలపుల సిరులు ఎన్నేళ్లకి
అబ్బాయి ఆశించే తీరే నీది
అమ్మాయి అల్లాడే రూపే నీది
గుండెల్లో తారాడే బాధే నీది
చిత్రంగా పోరాడే గాథే నీది
కాలం పోసే పుష్పం నువ్వే నువ్వే
ప్రాణం పాడే రాగం నువ్వే నువ్వే
తపన పడే.. నటనకు యువత మురిసేనులే
ఉలికి పడే.. ఘటనకు కనులు తడిసేనులే
వెన్నెల్ని కాటేసే రేయుంటుందా?
ఉదయాన్ని కాల్చేసే పొద్దుంటుందా?
కిరణాన్ని చీల్చేసే మబ్బుంటుందా?
నువ్వింక లేవంటే నమ్మేదుందా?
చిత్రం చెప్పిన కథగా మిగిలావులే
నీ స్నేహాలే మళ్లీ రాబోవులే
చిత్రం : చిత్రం చెప్పిన కథ (2014)
సంగీతం : మున్నాకాశీ
రచన : శ్రీరాం తపస్వి
గానం : మున్నాకాశీ
**********************************************
Udayinche kiranam laa.. hrudayaale thaakaavu
chitramgaa modalayyi.. manasulni dochaavu
therapai kadile bommalle maaye chesaavu
telugai merise chukkalle minne cheraavu
udayinche kiranam laa.. hrudayaale thaakaavu
chitramgaa modalayyi.. manasulni dochaavu
Tharagavule.. guruthula nidhulu ennaallaki
karagavule.. thalapula sirulu ennellaki
abbaayi aashinche theere needi
ammaayi allaade roope needi
gundello thaaraade baadhe needi
chitramgaa poraade gaathe needi
kaalam pose pushpam nuvve nuvve
praanam paade raagam nuvve nuvve
Thapana pade.. natanaku yuvatha murisenule
uliki pade.. ghatanaku kanulu thadisenule
vennelni kaatese reyuntundaa?
udayaanni kaalchese podduntundaa?
kiranaanni cheelchese mabbuntundaa?
nuvvinka levante nammedundaa?
chitram cheppina kathagaa migilaavule
nee snehaale malli raabovule
Movie Name : Chitram Cheppina Katha (2014)
Music Director : Munna Kasi
Lyricist : Sriram Thapasvi
Singer : Munna Kasi