వచ్చే.. వాసంతాలే..
విచ్చే.. నవ్వుల పూలే..
నచ్చే.. హృదయం నీదే..
తెచ్చే.. ఉదయం నీవే..
ఆహా ఏంటి ఈ వెన్నెలా
ఆహ్వనిస్తు నా కన్నుల
ఆనందంలొ ముంచిందిలా నదిలా..
సహవాసాల సరదాలుగా
సరిజోడైన స్నేహాలుగా
సాగే పయనమేదారికే మనసా..
వచ్చే.. వాసంతాలే..
విచ్చే.. నవ్వుల పూలే..
బంధమా నువ్వే.. అందమై పోవే..
జంటగా నచ్చే.. అద్భుతమై పోవే..
ఇష్టమా నువ్వే.. కొంచెమై రావే..
హృదయమే ఇచ్చే.. స్వాగతమై పోవే..
మొదటే పరిచయమా మొదలే పరవశమా
వచ్చే.. క్షణమే.. ఇక మధురం కాదా ఏమైనా
సహవాసాల సరదాలుగా
సరిజోడైన స్నేహాలుగా
సాగే పయనమేదారికే మనసా..
నీతో చెలిమి చేరిందిగా
నీలా నన్ను చూసిందిగా
నీకై అడుగు వేసిందిగా మనసే..
నిదురనే దూరం.. నిలిచినా భారం..
ఈ తియ్యని భావం.. అది కాదా నీ మహిమే
అల్లరే దారం.. అల్లికే ప్రాణం..
నవ్విన ఆ పెదవే.. ఉదయించిన మమకారం
అది ఓ.. పిలుపే కదిలే.. మనవరకే
ఏమో.. ఏంటో వినగా తెలిసే ప్రేమేలే
ఆహా ఏంటి ఈ వెన్నెలా
ఆహ్వనిస్తు నా కన్నుల
ఆనందంలొ ముంచిందిలా నదిలా..
సహవాసాల సరదాలుగా
సరిజోడైన స్నేహాలుగా
సాగే పయనమేదారికే మనసా..
చిత్రం : చిత్రం చెప్పిన కథ (2014)
సంగీతం : మున్నాకాశీ
రచన : కేదార్ నాథ్ పరిమి
గానం : శ్రీకృష్ణ, శివాని
**********************************************
Vacche.. vaasanthaale..
vicche.. navvula poole..
nacche.. hrudayam neede..
thecche.. udayam neeve..
aahaa enti ee vennelaa
aahwanisthu naa kannula
aanandam lo munchindilaa nadilaa..
sahavaasaala saradaalugaa
sarijodaina snehaalugaa
saage payanamedaarike manasaa..
vacche.. vaasanthaale..
vicche.. navvula poole...
Bandhamaa nuvve.. andamai pove..
jantagaa nacche.. adbhuthamai pove..
ishtamaa nuvve.. konchemai raave..
hrudayame icche.. swaagathamai pove..
modate parichayamaa modale paravashamaa
vacche.. kshaname.. ika madhuram kaadaa emainaa
sahavaasaala saradaalugaa
sarijodaina snehaalugaa
saage payanamedaarike manasaa..
neetho chelimi cherindigaa
neelaa nannu chusindigaa
neekai adugu vesindigaa manase..
Nidurane dooram.. nilichinaa bhaaram..
ee thiyyani bhaavam.. adi kaadaa nee mahime
allare daaram.. allike praanam..
navvina aa pedave.. udayinchina mamakaaram
adi o.. pilupe kadile.. manavarake
emo.. ento vinagaa thelise premele
aahaa enti ee vennelaa
aahwanisthu naa kannula
aanandam lo munchindilaa nadilaa..
sahavaasaala saradaalugaa
sarijodaina snehaalugaa
saage payanamedaarike manasaa..
Movie Name : Chitram Cheppina Katha (2014)
Music Director : Munna Kasi
Lyricist : Kedarnath Parimi
Singers : Srikrishna, Shivani