పల్లవి :
అదే నీవంటివి అదే నేవింటిని
గుండె అలలాగ చెలరేగ ఔనంటిని
అదే నీవంటివి అదే నేవింటిని
ఏమి అనలేని బిడియాన ఔనంటిని
అదే నీవంటివి అదే నేవింటిని
చరణం : 1
ఎవ్వరు లేని పువ్వులతోట
ఇద్దరు కోరే ముద్దులమూట
॥
ఎదలో కదలాడె పెదవుల తెరవీడి
చెవిలో ఝుమ్మని రవళించిన ఆ మాట
అదే నీవంటివి అదే నేవింటిని
చరణం : 2
పున్నమిరేయి పూచిన చోట
కన్నులు చేసే గారడి వేట
॥
చూపులు జతచేసి ఊపిరి శ్రుతిచేసి
తనువే జిల్లన కవ్వించిన ఆ మాట
అదే నీవంటివి అదే నేవింటిని
చరణం : 3
నిన్నూ నన్నూ కలిపిన బాట
నీలో నాలో పలికిన పాట
॥
జాబిలి సిగ్గిలగా కౌగిలి దగ్గరగా
మనసే ఝల్లన చిలికించి ఆ మాట
అదే నీవంటివి అదే నేవింటిని
ఏమి అనలేని బిడియాన ఔనంటిని
అదే నీవంటివి అదే నేవింటిని
చిత్రం : సప్తస్వరాలు (1969)
సంగీతం : టి.వి.రాజు
రచన : డా॥సి.నారాయణరెడ్డి
గానం : ఘంటసాల, పి.సుశీల
***************************************
Movie Name : Sapthaswaralu (1969)
Music Director : T.V.Raju
Lyricist : Dr. C. Narayana Reddy
Singers : Ghantasala, P.Susheela