సాకీ :
ఏ రంగో బోతీ... ఏ రంగో బోతీ
హాయ్ రంగొ బోతీ రంగ బోతీ కోనో కోలాథ
హోస్సిపతే కోహోకో కోహా
॥బోతీ॥
గోలాజేగోలాజేలాజే (2)
హాయ్ లాజ్‌లాజేలాజ్‌లజే ములియ్‌జేఛే
మోథాగోహో నైకోరో నైకోరో హోటా
॥
పల్లవి :
బులీ బుల్లీ నా బొండు మల్లీ (2)
హోయ్ పౌడరద్ది కుంకుమెట్టి
ముస్తాబయ్యొస్తే ఆడుదామే కోకో కోలాటం
చీర కట్టి సెంటు కొట్టి నా చెంత కొస్తే సూపుతాను కుర్రాడి వాటం
మల్లీ మల్లీ నా మావా (2)
హాయ్... డాబు చాలు గాని బాబూ నీ చెంతకొస్తే ముగ్గులాగ ముడిచేసుకుంటావ్
గడ్డి వాము చాటుకొచ్చి నే సైగ చేస్తే సిగ్గుతోటి లగెత్తుకుంటావ్
చరణం : 1
ఆ పంచ కట్టేసి ఓ పింఛమెడితే కిట్టయ్య
లాగా మా బాగా ఉన్నావే అందాల రాధమ్మ
నువుగాని అయితే నీ పక్క నేను
కిట్టయ్య నవుతానే
అమ్మదొంగ
ఎటకారం వద్దు
ఇంక నాతో చెలగాటం వద్దు
ఒకటయ్యే వీలే లేదా
ఓ వెన్నదొంగా ఈ కన్నె బెంగ తీరేది ఎట్టాగా
నా సామిరంగా బంగారు జింకా పట్టింది నేనేగా
॥బుల్లీ॥
చరణం : 2
నీ నవ్వు ముత్యాలు నే తీసుకెళ్లి
ముత్యాల హారం చేయించి ఇస్తాలే
నీ సూపు వజ్రాలు నేనేరుకెళ్లి
అద్దాలమేడ కట్టించి ఇస్తాలే
అయ్య బాబోయ్ గాలే కొట్టొద్దు
నువ్వు కూడా అట్టే మొయ్యొద్దు
నేనంటేను ప్రేమే లేదా వయ్యారి బాలా
ఓ మేఘమాల పండిందే నా పంట
ఓ సందమామ నా మేనమామ
నేనేగా నీ జంట
॥బుల్లీ॥॥బోతీ॥
చిత్రం : శ్రీరామ్ (2002)
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
రచన : కులశేఖర్
గానం : ఆర్.పి.పట్నాయక్, ఉష
****************************************
Movie Name : Sriram (2002)
Music Director : R.P.Patnaik
Lyricist : Kulasekhar
Singers : R.P.Patnaik, Usha