పూర్తిపేరు : తోటకూర వెంకట రాజు
జననం : 25-10-1921
జన్మస్థలం : రఘుదేవపురం, తూ.గో.జిల్లా.
తల్లిదండ్రులు : రత్తమ్మ, పెద్ద సోమరాజు
భార్య : 14-02-1951 - సావిత్రి
సంతానం :
కుమారులు (వెంకట సత్య సూర్యనారాయణరాజు - గిటారిస్ట్, వెంకట సోమరాజు (రాజ్) - సంగీత దర్శకులు)
తొలి చిత్రం : టింగ్ రంగా (1952)
ఆఖరి చిత్రం : మనుషుల్లో దేవుడు (1974) (ఈ చిత్రంలో మనుచరిత్రలోని వరూధిని ప్రవరాఖ్య ఘట్టంలో పద్యాలు, చెట్టంత మొనగాడ..., హే రేఖ ఓ శశిరేఖ... అనే రెండు పాటలను కంపోజ్ చేశారు. మిగతా పాటలను సాలూరి హనుమంతరావు పూర్తి చేశారు)
మొత్తం చిత్రాలు : వందకు పైగా తెలుగులో, తమిళం-3, కన్నడం-1
నిర్మించిన సినిమాలు : బాలనాగమ్మ (1959), శ్రీకృష్ణాంజనేయ యుద్ధం (1972) సినిమా ప్రారంభం కావటానికి పరోక్షంగా సహాయపడ్డారు.
నటించిన సినిమాలు : పల్లెటూరి పిల్ల (1950)లో గూఢచారిగా, పిచ్చి పుల్లయ్య (1953)లో న్యాయమూర్తిగా, బంగారుపాప (1954)లో డాక్టర్‌గా, పాండురంగ మహాత్మ్యం (1957)లో ‘కృష్ణా ముకుందా మురారి’ అనే పాటలో భక్తునిగా కనిపిస్తారు.
ఇష్టమైన వాద్యాలు : హార్మోనియం, ఎలక్ట్రికల్ గిటార్, సితార
ఇష్టమైన రాగాలు : మోహనరాగం, హంసధ్వని, హిందోళ
మరణం : 20-02-1973