పల్లవి :
పగలైతే దొరవేరా... రాతిరి నా రాజువురా
రాతిరి నా రాజువురా...
పక్కనే నువ్వుంటే ప్రతిరాత్రీ పున్నమిరా...
పక్కనే నువ్వుంటే ప్రతిరాత్రీ పున్నమిరా...
పగలైతే దొరవేరా... రాతిరి నా రాజువురా
రాతిరి నా రాజువురా...
చరణం : 1
పగలైతే నాలో నీ సొగసంతా దాగేరా...
పగలైతే నాలో నీ సొగసంతా దాగేరా...
రేయైతే వెన్నెలగ బయలంత నిండేరా
రాతిరి నా రాజువురా... రాతిరి నా రాజువురా...
చరణం : 2
నే కొలిచే దొరవైనా ...నను వలచే నా రాజువే..
నే కొలిచే దొరవైనా ...నను వలచే నా రాజువే..
కలకాల మీలాగే నిలిచే దాననే
పక్కనే నువ్వుంటే ప్రతిరాత్రీ పున్నమిరా
ప్రతిరాత్రీ పున్నమిరా
పగలైతే దొరవేరా... రాతిరి నా రాజువురా
రాతిరి నా రాజువురా...
చిత్రం : బంగారు పంజరం (1969)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు-బి.గోపాలం
రచన : దేవులపల్లి కృష్ణశాస్ర్తి
గానం : ఎస్.జానకి
****************************************
Pagalaithe Doravera... Rathiri Naa Rajuvura...
Rathiri Naa Rajuvura...
Pakkana nuvvunte prathi rathri punnamiraa
Pakkana nuvvunte prathi rathri punnamiraa
Pagalaithe Doravera... Rathiri Naa Rajuvura...
Rathiri Naa Rajuvura...
Movie Name : Bangaru Panjaram (1969)
Music Director : S.Rajeswar rao - B.Gopalam
Lyricist : Devulapali Krishnasastry
Singer : S.Janaki