పల్లవి :
ఆలపించనా అనురాగముతో...
ఆలపించనా అనురాగముతో...
ఆనందామృతమావరించగా
అవనీ గగనం ఆలకించగా...
ఆలపించనా... ఆలపించనా
చరణం : 1
చక్కని పూవులు విరిసి ఆడగా...
చల్లని గాలులు కలిసి పాడగా
పున్నమి వెన్నెల పులకరించగా...
పుడమిని సుఖాలు పొంగులెగరగా...
ఆలపించనా
చరణం : 2
చిలిపి గుండెలో వలపు నిండగా... చిరునవ్వులలో సిగ్గు చిందగా
చిలిపి గుండెలో వలపు నిండగా... చిరునవ్వులలో సిగ్గు చిందగా
అరమరలెరుగని అమాయకునిలో... అరమరలెరుగని అమాయకునిలో
ఆశయాలెవో అవతరించగా... ఆశయాలెవో అవతరించగా
ఆలపించనా....
చరణం : 3
కరుణ హృదయమే తాజ్ మహల్గా... అనంత ప్రేమకు ఆశ చెందగా
కరుణ హృదయమే తాజ్ మహల్గా... అనంత ప్రేమకు ఆశ చెందగా
నిర్మల ప్రేమకు నివాళులెచ్చే... నిర్మల ప్రేమకు నివాళులెచ్చే
కాంతిరేఖలే కౌగలించగా.... కాంతిరేఖలే కౌగలించగా
ఆలపించనా ...
ఆలపించనా అనురాగముతో... ఆనందామృతమావరించగా
అవనీ గగనం ఆలకించగా... ఆలపించనా
చిత్రం : పిచ్చి పుల్లయ్య (1953)
సంగీతం : టి.వి.రాజు
రచన : అనిసెట్టి సుబ్బారావు
గానం : ఘంటసాల
**********************************************
Movie Name : Pichi Pullayya (1953)
Music Director : T.V.Raju
Lyricist : Anisetti Subbarao
Singer : Ghantasala