పవిత్రాణాయ సాధూనాం
ఆవిరి కుప్పం విధ్వంసం
వినాశాయ చదుష్క్రుతాం
నీరుకొండ అమానుషం
ధర్మ సంస్థాపనార్ధాయ
ధరణి కోట దానవత్వం
సంభవామి యుగే యుగే
దళిత మనవ నాశనార్ధం
ఏ అసురుడు సృస్టించిన పంచమ తంత్రం
నరజాతిని వంచించిన దారుణ కులమంత్రం
నరకబడిన శంభూకుని శిరం సాక్షిగా
తెగిపడిన ఏకలవ్య బొటనవేలు సాక్షిగా
ముంతల చీపురుల మన దీనగతం సాక్షిగా
ప్రశ్నించిన ప్రతీ చోట మహా రక్త క్షేత్రం
అడగండోయ్ అరవండోయ్
మీ గుండెల డప్పు కొట్టి నినదిస్తూ నిలదీస్తూ
అడగండోయ్
పంచముణ్ణి సృష్టించిన ఆ వంచకుడెవడని
అడగండోయ్ మీరు అడగండోయ్
నరమేధపు మహారధం గుండెలపై నడచినా
నలిగిన పేదరికం చితికి చిధ్రమవుతున్నా
కసితో దొరతనమే పశువై తల విసిరినా
అసహాయుల ఘోషతో దిశలు మరు మ్రోగినా
కళ్ళుండి చెవులుండి కనని వినని కారకులను అడగండోయ్
పంచముణ్ణి సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండోయ్
తల ఎత్తిన స్త్రీ ధైర్యం బలికి తరలిపోతుంది
గళమెత్తిన ధైన్యంలో జనం కుమిలిపోతుంది
మనువాదపు మంటల్లో ఊరు తగలబడుతోంది
మగ పశువుల కాళ్ళ కింద మగువ నలిగిపోతోంది
ఈ దౌష్టం ఇక వద్దని ఈ క్రౌర్యం ఇక వద్దని
అరవండోయ్
పంచముణ్ణి సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండోయ్
అర్ధరాత్రి ఆడపడుచు సంచరించు స్వర్గం
రానీయదు ఏ నాటికీ ఈ రాక్షస రాజ్యం
బలవంతుల రక్షణకే భక్షకభట వర్గం
వెలివాడల కన్నీటికి కరగదులే ధనస్వామ్యం
ఇక తప్పదు ప్రతి ఒకడు ఒక ఉరుమై ఒక మెరుపై
పిలవండోయ్
మీ గుండెల డప్పు కొట్టి నినదిస్తూ నిలదీస్తూ అడగండోయ్
పంచముణ్ణి సృష్టించిన ఆ వంచన తల తెంచగ
కదలండో..మీరు గెలవండో....
చిత్రం : ఒసేయ్ రాములమ్మా (1997)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
రచన :
గానం :
**************************************************
pavitranaya sadhunaam
aaviri kuppam vidhvasam
vinaashaya chadushkrutaam
nerukonda amanusham
dharma samstapanardhaaya
dharani kota danavatvam
sambhavami yuge yuge
dalita manava nashanardham
ye asurudu srustinchina panchama tantram
narajatini vanchinchina daruna kulamantram
narakabadina shambhukuni shiram sakshigaa
tegipadina yekalavya botanavelu sakshigaa
muntala cheepurula mana deenagatam sakshiga
prashninchina pratee chota mahaa rakta kshetram
adagandoy aravandoy
me gundela dappu kotti ninadistu niladestu
adagandoy
panchamunni srustinchina aa vanchakudevadanai
adagandoy meru adagandoy
naramedhapu maharadham gundelapai nadachinaa
naligina pedarikam chitiki chidhramavutunnaa
kasito dorataname pashuvai tala visirinaa
asahayula ghoshato dishalu maru mroginaa
kallundi chevulundi kanani vinani karakulanu adagandoy
panchamunni srustinchina aa vanchakudevadani adagandoy
tala yettina sthri dhairyam baliki taralipotundi
galamettani dhainyamlo janam kumilipotundi
manuvadapu mantallo vuru tagalabadutondi
maga pashuvula kalla kinda maguva naligipotondi
ee doushtam ika vaddani ee krouryam ika vaddani
aravandooy
panchamunni srustinchina aa vanchakudevadani adagandoy
ardharatri adapaduchu sancharinchu swargam
raneeyadu ye natiki ee rakshasa rajyam
balavantula rakshanake bhakshakabhata vargam
velivadala kannetiki karagadule dhanaswamyam
ika tappadu prati okadu oka urumai oka merupai
pilavandoy
me gundela dappu kotti ninadistu niladistu adagandoy
panchamunni srustinchina aa vanchana tala tenchaga
kadalandoo..meru gelavandoo....
Movie Name : Osey Ramulamma (1997)
Music Director : Vandemataram Srinivas
Lyricist :
Singer :