పల్లవి :
పగడాల దీవిలో.. పరువాల చిలక
తోడుగా చేరింది.. పడుచు గోరింక
ఓయమ్మ నీ అందం.. వేసింది బంధం
నా కళ్ళకు కాళ్ళకూ.. నా కళ్ళకు కాళ్ళకు
ముత్యాల కోనలో.. గడుసుగోరింక
ఆశగా చూసింది.. చిలకమ్మ వంక
ఓరయ్యో నీ చూపే.. వేసింది బంధం
నా కళ్ళకు కాళ్ళకూ.. నా కళ్ళకు కాళ్ళకు
చరణం : 1
ఎరుపేది మలిసంధ్యలో.. ఓ.. అది దాగింది నీ బుగ్గలో
వెలుగేది తొలిపొద్దులో.. ఓ.. అది తెలిసింది నీ రాకలో
ఆ..ఎన్నడు చూడనీ..అందాలన్నీ..
ఎన్నడు చూడనీ..అందాలన్నీ....
చూశాను ఈ బొమ్మలో..ఓ..హా..
ముత్యాలకోనలో.. గడుసు గోరింక
ఆశగా చూసింది చిలకమ్మ వంక
ఓరయ్యో నీ చూపే వేసింది బంధం
నా కళ్ళకు కాళ్ళకూ... నా కళ్ళకు కాళ్ళకు
చరణం : 2
నీ చిలిపి చిరునవ్వులే..ఏ.. ఊరించే నా వయసునూ
ఓ..హో..ఆ సోగ కనురెప్పలే..ఏ..కదిలించే నా కోర్కనూ
ఆ.. నీవే నేనై తోడు నీడై.. నీవే నేనై తోడు నీడై
నిలవాలి నూరేళ్ళకు..
పగడాల దీవిలో పరువాల చిలక
తోడుగా చేరింది పడుచు గోరింక
ఓరయ్యో నీ చూపే వేసింది బంధం
నా కళ్ళకు కాళ్ళకూ..నా కళ్ళకు కాళ్ళకు
ఓయమ్మ నీ అందం వేసింది బంధం
నా కళ్ళకు కాళ్ళకూ..నా కళ్ళకు కాళ్ళకు
చిత్రం : దొంగలకు దొంగ (1977)
సంగీతం : సత్యం
రచన : మైలవరపు గోపి
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, పి.సుశీల
*******************************************
Movie Name : Dongalaku Donga (1977)
Music Director : Satyam
Lyricist : Mailavarapu Gopi
Singers : S.P.Balasubramanyam, P.Susheela