పల్లవి :
ఆడే పాడే పసివాడా...
ఆడేనోయీ నీ తోడా
ఆనందం పొంగేనోయి దీపావళి
ఇంటింట వెలుగు దీపాల మెరుగు
ఎనలేని వేడుకరా... ఎనలేని వేడుకరా...
చరణం : 1
చిరునవ్వు వెన్నెల్లు చిలికేటివాడా
అరుదైన చిరుముద్దు అరువీయరారా
చిరునవ్వు వెన్నెల్లు చిలికేటివాడా
అరుదైన చిరుముద్దు అరువీయరారా
నా మదిలో నీకు నెలవే కలదూ
నా మదిలో నీకు నెలవే కలదూ
బదులే నాకూ నీవీయవలదు
నీపై మేము నిలిపిన ఆశలు
నిజమైన చాలునురా... ఆ.. ఆ..
నిజమైన చాలునురా
చరణం : 2
చిన్నారి జయమంచు మ్రోగే పఠాసు
చిటపటమని పూలు చిమ్మే మతాబు
చిన్నారి జయమంచు మ్రోగే పఠాసు
చిటపటమని పూలు చిమ్మే మతాబు
నీ రూపమే ఇంటి దీపము బాబూ
నీ రూపమే ఇంటి దీపము బాబూ
మాలో పెరిగే మమతవు నీవు
మంచనిపించి మము మురిపించిన
మరివేరే కోరమురా... ఆ.. ఆ..
మరివేరే కోరమురా
ఆడే పాడే పసివాడా...
ఆడేనోయీ నీ తోడా
ఆనందం పొంగేనోయి దీపావళి
ఇంటింట వెలుగు దీపాల మెరుగు
ఎనలేని వేడుకరా... ఎనలేని వేడుకరా...
చిత్రం : పెళ్లి కానుక (1960)
సంగీతం : ఏ.ఎం. రాజా
రచన : చెరువు ఆంజనేయశాస్త్రి
గానం : పి.సుశీల
********************************************
Movie Name : Pelli Kanuka (1960)
Music Director : A.M.Raja
Lyricist : Cheruvu Anjaneya Sastry
Singer : P.Susheela